ETV Bharat / sports

భారత్​కు హోమ్ గ్రౌండ్​గా లాహోర్​ - గట్టి బందోబస్తుతో! - Champions Trophy 2025

Champions Trophy 2025 Teamindia : ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం టీమ్​ఇండియాకు పాకిస్థాన్​కు వెళ్తుందో లేదో తెలీదు కానీ పీసీబీ మాత్రం తమ దేశంలోనే టోర్నీని నిర్వహించేలా సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా టీమ్​ఇండియా కోసం అన్నీ మ్యాచ్​లు ఒకే వేదికపై ఆడేలా లాహోర్​ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. భారత జట్టు కోసం అత్యుత్తమ భద్రతా ఏర్పాట్లను చేయబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఐసీసీకి డ్రాఫ్ట్ షెడ్యూల్​ను కూడా పంపించిందట. పూర్తి వివరాలు స్టోరీలో

Source The Associated Press
Champions Trophy (Source The Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 4:52 PM IST

Champions Trophy 2025 Teamindia : వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో టీమ్​ఇండియా పాల్గొనడంపై కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే అసలు ఆ టోర్నీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం అన్నీ ఏర్పాట్లు చేసుకునే దిశగా ముందుకువెళ్తోంది. అయితే తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

వాస్తవానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ మూడు వేదికలను ఖరారు చేసింది. లాహోర్‌, కరాచి, రావల్పిండిలో టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు రచించింది. ఈ విషయాన్ని మరోసారి పీసీబీలోని ఓ అధికారి తెలిపారు. ముఖ్యంగా టీమ్​ఇండియా ఆడే అన్ని మ్యాచ్​ల కోసం లాహోర్‌ను వేదికగా ఫిక్స్ చేసిందట. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ షెడ్యూల్​ను ఇప్పటికే పీసీబీ ఐసీసీకి పంపినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. "అవును, టీమ్​ఇండియాకు హోమ్​ బేస్​గా లాహోర్​ను వేదికగా పరిశీలించారు. ఈ వేదిక వల్ల భారత జట్టుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. అలానే వారి కోసం అత్యుత్తమ భద్రతా ఏర్పాట్లను చేయబోతున్నారు. ఐసీసీకి డ్రాఫ్ట్ షెడ్యూల్​ను కూడా పంపించారు" అని వెల్లడించారు.

కాగా, ఆటగాళ్ల భద్రత, ఇతర కారణాల వల్ల టీమ్‌ఇండియా చాలాకాలంగా పాక్‌ పర్యటనకు వెళ్లడం ఆపేసింది. చివరిసారిగా 2008 ఆసియా కప్‌ కోసం అక్కడ పర్యటించింది. గతేడాది ఆసియా కప్‌ మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ వెళ్లడానికి బీసీసీఐ నిరాకరించడంతో హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించారు. పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు, మిగతా 9 మ్యాచ్‌లు శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్​లో టీమ్ఇండియా పర్యటిస్తుందా, లేదా అనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ప్రతిపాదించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఛాంపియన్స్​ టోర్నీ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 19న కరాచీలో జరగనుంది. రెండు సెమీఫైనల్‌ మ్యాచులు కరాచీ, రావల్పిండిలో నిర్వహించనున్నారు. మార్చి 9న ఫైనల్ మ్యాచ్​కు లాహోర్‌ ఆతిథ్యమివ్వనుంది. కాగా, లాహోర్​ మైదానంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు, రావల్పిండిలో ఐదు, కరాచీలో మూడు మ్యాచ్‌లు జరిగేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. చూడాలి మరి టీమ్​ఇండియా పాక్ పర్యటనకు వెళ్తుందో లేదో.

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా- పాక్​ను దెబ్బకొట్టింది 'బుమ్రా'నే

రూ.2లక్షల టికెట్​ కోసం ట్రాక్టర్ అమ్మిన పాక్ ఫ్యాన్- పాపం మ్యాచ్ పోయిందిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.