Rohit Sharma Batting Position : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌పై సస్పెన్స్ వీడింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్టార్ బ్యాటర్ కే ఎల్ రాహుల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా కొనసాగుతాడని రోహిత్ స్వయంగా వెల్లడించాడు. తాను మిడిల్ ఆర్డర్లో బరిలో దిగుతానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం భారత్ ఓపెనింగ్ జోడీ బాగానే ఉందన్న రోహిత్, దాన్ని మార్చడం అవసరం లేదని పేర్కొన్నాడు. రెండో టెస్టుకు ముందు పాల్గొన్న మీడియా సమావేశంలో రోహిత్ ఓపెనింగ్ జోడీపై క్లారిటీ ఇచ్చాడు.
'తొలి మ్యాచ్‌లో రాహుల్ బ్యాటింగ్ నేను లైవ్‌లో చూశాను. అతడు అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం టీమ్ఇండియా ఓపెనింగ్ బాగుంది. ఓవర్సీస్లో రాహుల్ రాణిస్తున్నాడు. జైస్వాల్- రాహుల్ జోడీనే తొలి మ్యాచ్ గెలుపులో కీలకం అయ్యింది. ఈ జోడీని ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు. భవిష్యత్‌లో మాత్రం ఈ పరిస్థితులు మారవచ్చు' అని రోహిత్ టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై క్లారిటీ ఇచ్చాడు.
ఇక తాజా క్లారిటీతో యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఓపెనర్‌గా కొనసాగన్నాడు. ఒకవేళ శుభ్‌మన్ తుది జట్టులోకి వస్తే వన్ డౌన్లో దిగడం పక్కా. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఐదో ప్లేస్‌లో రోహత్ వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 6న ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డే/నైట్ ఫార్మాట్లో ఆడిలైడ్ వేదికగా జరగనుంది.
𝗣𝗿𝗲𝗽 𝗠𝗼𝗱𝗲 🔛 #TeamIndia gearing up for the Pink-Ball Test in Adelaide 👌 👌#AUSvIND pic.twitter.com/5K4DlBtOE6
— BCCI (@BCCI) December 4, 2024
అయితే వ్యక్తిగత కారణాల వల్ల బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రోహిత్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో జైస్వాల్‌తో కలిసి రాహుల్ టీమ్ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఈ జోడీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టింది. జైస్వాల్ భారీ సెంచరీ (161 పరుగులు)తో రాణించగా, రాహుల్ (77 పరుగులు) ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 201 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేశారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 487-6 వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం 534 పరగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 238 స్కోర్ వద్ద ఆలౌటైంది. భారత్ 295 రన్స్‌తో నెగ్గింది.
భారత్, ఆసీస్ రెండో టెస్టు - రోహిత్ బ్యాటింగ్ ప్లేస్‌పై చర్చ!