Bowlers To Batters In Cricket History : క్రికెట్లో బ్యాటర్ లేదా బౌలర్‌గా అరంగేట్రం చేసి ఆల్రౌండర్లుగా మారిన క్రికెటర్లు ఉన్నారు. అయితే బౌలర్‌గా కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ క్రికెట్లో మంచి బ్యాటర్లుగా రాణించారు ఐదుగురు క్రికెటర్లు. వారెవరు? ఏ దేశానికి చెందినవారో? తెలుసుకుందాం.
స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను అంతర్జాతీయ క్రికెట్లో ఒక మంచి బ్యాటర్‌గా చెబుతుంటారు. అందుకు తగ్గట్లే స్మిత్ కూడా వన్డేలు, టెస్ట్‌లలో అదరగొడుతుంటాడు. 2010లో లెగ్ స్పిన్నర్‌గా ఆస్ట్రేలియా టీమ్‌లోని దిగ్గజ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ స్థానంలో వచ్చాడు స్టీవ్ స్మిత్. అయితే 2012లో స్మిత్ మంచి బ్యాటింగ్ చెయ్యగలడని తేలింది. 2014 యాషెస్ సిరీస్‌లో తనదైన బ్యాటింగ్ శైలితో స్మిత్ అదరగొట్టాడు. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టు తరఫున ప్లేయర్‌గా ఉండగా రెండు వన్డే ప్రపంచకప్‌లు, టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. జట్టు విజయంలో స్మిత్ కీలకపాత్ర పోషించాడు. స్మిత్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 16,000కు పైగా పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో అతడి బ్యాటింగ్ యావరేజ్ 58 కావడం విశేషం. బౌలర్‌గా జట్టులోకి అడుగుపెట్టి అదరగొడుతున్నాడు స్టీవ్ స్మిత్.
రవిశాస్త్రి
1981లో టెస్ట్‌ల ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి స్పిన్నర్‌గా అడుగుపెట్టాడు రవిశాస్త్రి. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగేవాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌తో ఆకట్టుకుని వీర విధ్వంసం సృష్టించాడు. దీంతో టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా మారిపోయాడు. 1983లో టీమ్ఇండియా వరల్డ్ కప్ సాధించడంలో రవిశాస్త్రిది కీలక పాత్ర. ఇండియా తరఫున రవిశాస్త్రి 230 మ్యాచులు ఆడాడు.
షాహిద్ ఆఫ్రిది
పాకిస్థాన్ దిగ్గజ బ్యాటర్ షాహిద్ అఫ్రిది తన కెరీర్‌ను బౌలర్‌గా మొదలుపెట్టాడు. లెగ్ స్పిన్నర్‌గా రాణించిన అఫ్రిది ఆ తర్వాత తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బంతిని బౌండరీలు దాటించేవాడు. భారీ సిక్సర్లను కొట్టేవాడు. అందుకే ఫ్యాన్స్ అతడిని 'బూమ్ బూమ్ ఆఫ్రిది' ముద్దుగా పిలుచుకుంటారు. మొత్తం అంతర్జాతీయ కెరీర్లో అఫ్రిది 11వేల పరుగులు చేశాడు. 541 వికెట్లు పడగొట్టాడు.
సనత్ జయసూర్య
శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత బ్యాటర్‌గా మారిపోయాడు. తన కెరీర్లో 20,966 పరుగులు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, 440 వికెట్లు తీశాడు.
షోయబ్ మాలిక్
షోయబ్ మాలిక్ 1999లో ఆఫ్ స్పిన్నర్‌గా తన వన్డే అరంగేట్రం చేశాడు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. మాలిక్ అతడి కెరీర్లో 12,938 పరుగులు, 200 వికెట్లు పడగొట్టాడు.