ETV Bharat / sports

ఆ ప్లేయర్స్​కు షాకిచ్చిన బీసీసీఐ - గంభీర్ రాకతో మారిన రూల్స్​! - BCCI Test Cricketers - BCCI TEST CRICKETERS

TestCricket Players Domestic Cricket : హెడ్ కోచ్​ గంభీర్ అప్పుడే తన మార్క్ కోచింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్లకు బీసీసీఐ సరికొత్త కండిషన్ పెట్టినట్లు సమాచారం.

source ANI
TestCricket Players (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 6:37 PM IST

TestCricket Players Domestic Cricket : భారత క్రికెట్‌ హెడ్​ కోచ్​గా గంభీర్‌ ఇటీవలే ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నెల చివర్లో లంకతో టీమ్​ఇండియా ఆడబోయే టీ20, వన్డే సిరీస్​లతో గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే దీనికి మరో 15 రోజులు సమయం ఉండగానే గంభీర్ తన మార్క్ కోచింగ్​ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్లకు బీసీసీఐ సరికొత్త కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా బోర్డు భారత జట్టు టెస్టు స్పెషలిస్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్​లో జరగబోయే దులీప్‌ ట్రోఫీకి టెస్టు టీమ్​ రెగ్యులర్ ప్లేయర్స్​ అందుబాటులో ఉండాలని పేర్కొంది. ప్రతి ప్లేయర్​ కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది.

సెప్టెంబరులో స్వదేశంలో మొదలుకానున్న టెస్టు సీజన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట. కాగా, సెప్టెంబర్‌లో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌తో భారత టెస్ట్‌ సీజన్‌ మొదలుకానుంది. అనంతరం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరగగా, నవంబర్‌ 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు టీమ్​ఇండియా ఆస్ట్రేలియా పర్యటనుకు వెళ్లి ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది.

ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్​లకు దూరంగా ఉంటే సమయంలో దేశవాళీ టోర్నీలకు అందుబాటులో ఉండాలని బోర్డు కార్యదర్శి జై షా అన్నారు. కానీ స్టార్‌ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రాకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన ఈ ముగ్గురు ప్లేయర్స్​ గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

"ఈ సారి దులీప్ ట్రోఫీ కోసం జోనల్ సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయలేదు. నేషనల్ సెలక్షన్ కమిటీ మాత్రమే ఈ దులీప్ ట్రోఫీ టీమ్స్​ను సెలెక్ట్ చేస్తుంది. టెస్ట్ టీమ్​ పోటీదారులందరినీ సెలక్ట్ చేస్తారు. అయితే విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా ఆడాలా? వద్దా అనేది వారి నిర్ణయానికే వదిలేశాం" అని బీసీసీఐకు సంబంధించిన వర్గాలు పేర్కొన్నాయి.

ఐసీసీ ర్యాంకింగ్స్​ - అదరగొట్టిన హర్మన్​ ప్రీత్​, షెఫాలీ - ICC T20 rankings

పారిస్​ ఒలింపిక్స్​ - ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది అథ్లెట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.