ETV Bharat / sports

అతడిని ఒప్పించేందుకు ధోనీ సాయం కోరిన బీసీసీఐ - ఎందుకంటే? - Team India Head Coach BCCI - TEAM INDIA HEAD COACH BCCI

Team India Head Coach BCCI : కొంతకాలంగా బీసీసీఐ టీమ్‌ ఇండియా కోచ్‌ ఎంపికలో నిమగ్నమైంది. మరి కొద్ది రోజుల్లో అప్లికేషన్‌ గడువు కూడా ముగుస్తుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ధోనీ సాయం కోరిందట! పూర్తి వివరాలు స్టోరీలో.

MS DHONI
MS DHONI (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 7:16 PM IST

Team India Head Coach BCCI : ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ వారసులుగా కొందరి పేర్లు వినిపించాయి. అయితే దరఖాస్తు చేసుకోవడానికి గడువు సమీపిస్తున్న తరుణంలో స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను హెడ్‌ కోచ్‌కి అప్లై చేసుకునేలా ఒప్పించాలని దిగ్గజ ఆటగాడు ఎంఎస్‌ ధోనీనీ బీసీసీఐ కోరినట్లు సమాచారం.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫ్లెమింగ్ కొనసాగుతున్నాడు. ఎక్కువ కాలం సీఎస్​కే హెడ్‌ కోచ్‌గా కూడా పని చేశాడు. అతని హయాంలోనే చెన్నై ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ గెలుచుకుంది. ఈ కాలంలో అతనికి ధోనీతో సన్నిహిత సంబంధం ఏర్పడింది.

అయితే ఫ్లెమింగ్‌ టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌ అయితే బావుంటుందని బీసీసీఐ భావిస్తోందట. అందుకే హెడ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేలా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌ ఫ్లెమింగ్‌ను ధోనీ ఒప్పించగలడని అనుకుంటోంది. ఫ్లెమింగ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేర్వేరు T20 టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అంత బిజీగా ఉంటూ కూడా, తన ఫ్యామిలీకి క్వాలిటీ టైమ్‌ కేటాయిస్తున్నాడు. ఇలాంటి సమయంలో 2027 వరకు టీమ్‌ ఇండియాకు కమిట్‌ అవ్వడానికి అతను కాస్త సంకోచించినట్లు సమాచారం.

ద్రావిడ్‌కి జరిగినట్లే ఫ్లెమింగ్‌కు జరగవచ్చు! - ఓ బీసీసీఐ అధికారి ఓ ఇంగ్లీష్​ మీడియాతో మాట్లాడుతూ 'ఫ్లెమింగ్ నో చెప్పలేదు. అతను కాంట్రాక్ట్ టెన్యూర్‌ గురించి తన ఆందోళనలను వ్యక్తం చేశాడు. ఇలాంటివి సాధారణమే. రాహుల్ ద్రవిడ్ కూడా మొదట్లో అంతగా ఆసక్తి చూపలేదు. ఆయన్ను ఒప్పించారు. ఫ్లెమింగ్ విషయంలో కూడా అదే జరిగితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ పని చేయడానికి ఎంఎస్‌ ధోనీ కంటే సరైన వాళ్లు ఇంకెవరు ఉన్నారు.' అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ జరుగుతున్న సమయంలో ధోనీనీ సంప్రదించడం సరికాదు. కానీ ఇప్పుడు చెన్నై ఎలిమినేట్‌ అయింది కాబట్టి, సంప్రదించవచ్చని చెప్పాడు.

కాగా, టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌గా పాపులర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్, జస్టిన్ లాంగర్, మహేల జయవర్ధనే సహా మరికొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరికి ఎవరిని బీసీసీఐ ఎంపిక చేస్తుందో తెలియాలంటే? మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.

వరల్డ్‌కప్‌ జట్టు ప్లేయర్స్​ లేకుండానే ఐపీఎల్‌ టాప్‌-2 టీమ్స్​! - T20 World cup 2024

'R' - ఈ నాలుగు జట్లలో కామన్‌ పాయింట్ గమనించారా? - IPL 2024 Play Offs

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.