ETV Bharat / sports

ఐసీసీ ఛైర్మన్​గా జైషా! BCCI సెక్రటరీగా బీజేపీ నేత కుమారుడు!! - BCCI Secretary Post

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 8:44 PM IST

BCCI Next Secretary : బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీకి ఛైర్మన్​ పదవికి ఎన్నికల బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన నిజంగానే బరిలోకి దిగితే తర్వాత బీసీసీఐ కార్యదర్శిగా ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఓ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి తనయుడు పేరు తెరపైకి వచ్చింది.

BCCI Next Secretary
BCCI Next Secretary (IANS)

BCCI Next Secretary : ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్​ పదవికి కోసం పోటీ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌ క్లే పదవీకాలం నవంబర్‌ 30తో ముగియనుంది. అయితే మరోసారి ఆయన ఎన్నికల బరిలో నిలిచేందుకు నిరాసక్తి వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ సెక్రట్రీ జై షా నిలుస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. షా ఎన్నికల బరిలో నిలిస్తే ఐసీసీ నూతన ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

అయితే జై షా ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపడితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవితోపాటు, బీసీసీఐ సెక్రటరీ పదవుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. దీంతో జై షా స్థానంలో ఎవరు నియమితులవుతారనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి తనయుడు పేరు బాగా వినిపిస్తోంది. తనే తదుపరి కార్యదర్శిగా నియమితులవుతారని ప్రచారం జరుగుతోంది. ఆయనే దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు, దిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి రేసులో ముందున్నట్లు సమాచారం.

ఐసీసీ ఛైర్మన్ జై షా!
ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్‌గా నియమితులైతే అతడి స్థానంలోకి రోహన్ వచ్చే అవకాశం ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. జై షాకు ఐసీసీ బోర్డులోని 16 మంది సభ్యుల్లో 15 మంది సపోర్ట్‌ ఉన్నట్లు తెలిస్తోంది. విజేతకు తొమ్మిది ఓట్ల సాధారణ మెజారిటీ (51%) అవసరం. అందుకే జై షా ఎంపిక దాదాపు ఖాయమని సమాచారం.

రోహన్‌కు సపోర్ట్‌
బోర్డు సెక్రటరీ రేసులో రోహన్ జైట్లీ పేరు ముందుంది. రోహన్ ఎంపికకు అందరూ ఏకీభవించారు. అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఇతర ఆఫీస్ బేరర్లు పదవీ కాలం ఏడాది తర్వాత ముగుస్తున్నందున వారి వారి స్థానాల్లో కొనసాగుతారు.

షా చరిత్ర సృష్టిస్తాడా?
ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్‌ను సమర్పించడానికి ఆగస్టు 27 చివరి తేదీ. కొత్త ఐసీసీ ఛైర్మన్ డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2020 నవంబర్‌లో మొదటిసారి బార్క్లే ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. 2022లో కూడా తిరిగి ఎన్నికయ్యారు. నవంబర్‌ చివరిలో రాజీనామా సమర్పించనున్నారు.

షా ప్రస్తుతం ఐసీసీ, ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ (F&CA) సబ్-కమిటీలో భాగంగా ఉన్నారు. షా ఎన్నికైతే, జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్.శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ తర్వాత ఐసీసీకి నాయకత్వం వహించిన ఐదో భారతీయుడు అవుతారు. 35 ఏళ్ల వయసులో గ్లోబల్ బాడీకి అతి పిన్న వయస్కుడైన అధిపతిగా చరిత్ర సృష్టిస్తాడు.

BCCI సెక్రట్రీ రేసులో ఆ ముగ్గురు మాజీలు - ఎవరు వస్తే ఏం చేస్తారంటే।? - BCCI Secretary Post

ICC ఛైర్మన్​లుగా చేసిన ఇండియన్స్- లిస్ట్​లో మాజీ CM శరద్ పవార్! - ICC Chairman Indians

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.