BCCI Amends rules Domestic Cricket Penalty Runs : దేశవాళీ క్రికెట్‌లో మార్పులు చేస్తూ భారత క్రికెట్ బోర్డ్ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం సవరణలు కూడా చేసిందట. పెనాల్టీ పరుగులకు సంబంధించి రూల్స్‌లో బోర్డు మార్పులు చేసినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ నోట్ కూడా పంపినట్లు సమాచారం.
బ్యాటర్ బంతిని బాదినప్పుడు, దానిని ఆపే క్రమంలో ఫీల్డింగ్‌కు సంబంధించిన పరికరాలు, వస్తువులను తాకినప్పుడు బ్యాటింగ్ జట్టుకు 'పెనాల్టీ' రూపంలో అదనంగా పరుగులు ఇచ్చేవారు. కానీ ఇకపై అలా ఇవ్వడం కుదరకుండా చేసింది. ఇక నుంచి అలా అనుకోకుండా జరిగినా, దానిని మోసపూరిత ఫీల్డింగ్‌గా పరిగణించరు. అప్పుడు ప్రత్యర్థికి ఎలాంటి పెనాల్టీ పరుగులు ఇవ్వరు.
"ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్ నుంచి పొర పాటున బంతి చేజారితే, అదే సమయంలో ఆ బంతి ఏదైనా పరికరం, క్లాత్, లేదా ఇతర వస్తువులపై పడినా, దానిని ఇల్లీగల్ బంతిగా పరిగణించం. వికెట్ కీపింగ్ గ్లోవ్‌లు, ఫీల్డర్ క్యాప్‌లు కింద పడినప్పుడు, బంతి తగిలినా పెనాల్టీ పరుగులు ఇవ్వం. బంతి ఇంకా గేమ్‌లోనే ఉన్నట్టే. అదే సమయంలో వికెట్ పడినా కూడా దానిని సరైందిగానే ప్రకటిస్తాం." అని బీసీసీఐ చెప్పినట్లు ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఈ సవరణ చేసిన నిబంధనలు ఇక పై జరగబోయే దేశవాళీ క్రికెట్‌లో అమలు అవుతాయని బోర్డు తెలిపింది.
ఇంతకముందు ఎలా ఉందేడంటే? - ఫీల్డర్ బంతిని పట్టుకునే క్రమంలో, కింద పడి ఉన్న వస్తువుకు తాకితే అప్పటితో ఆ బంతి డెడ్ అయిపోతుంది. అప్పుడు పెనాల్టీ పరుగులు ప్రత్యర్థి జట్టుకు ఇస్తారు. ఒకవేళ అప్పటికే బ్యాటర్లు కొన్ని రన్స్ చేసి ఉంటే, అవి కూడా అదనంగా కలుస్తాయి. అదే సమయంలో ఎందుకు పెనాల్టీగా ఇచ్చాం అనేది కూడా ఇరు జట్ల కెప్టెన్లకు అంపైర్లు తెలపాలి. ఆ ఓవర్‌లో బాల్‌ను కౌంట్ చేయరు. ఇప్పుడీ ఈ నిబంధనలనే బీసీసీఐ సవరణలు చేసింది. ఉద్దేశపూర్వకంగా బంతి సదరు వస్తువులను తాకలేదని అంపైర్లు అనుకుంటే, దానిని మోసపూరితంగా భావించక్కర్లేదు. సరైన బంతిగానే పరిగణించి, అప్పుడు ఏ రిజల్ట్ వస్తుందో దానినే అమలు చేస్తారు.
కివీస్‌తో మూడో టెస్టు - మళ్లీ మూడు మార్పులతో టీమ్ ఇండియా!
ఈ 5 యంగ్ ప్లేయర్స్‌కు భలే ఛాన్స్ - టీమ్ ఇండియాలో స్థిరపడతారా?