Azaj Patel India Vs New Zealand : న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు(25) తీసిన విదేశీ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు తీయడంలో ఈ ఫీట్‌ను అందుకున్నాడు కివీస్ స్పిన్నర్.
ఓకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు
కివీస్ సంచలన బౌలర్ అజాజ్ పటేల్ 2021 భారత పర్యటనలో అదరగొట్టాడు. వాంఖడే వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్ లోనే ఏకంగా పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత అదే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో మొత్తం ఆ మ్యాచ్ లో 14 వికెట్లు అజాజ్‌కు దక్కాయి. తాజాగా వాంఖడే వేదికగా భారత్‌తో జరిగిన టెస్టులోనూ అజీజ్ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ముంబయి స్టేడియంలో మొత్తం 25 వికెట్లు పడగొట్టినట్లైంది. ఈ క్రమంలో భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా నిలిచాడు.
'దాన్ని సద్వినియోగం చేసుకున్నాను'
"స్పిన్ బౌలింగ్ అనేది రిథమ్‌కి సంబంధించినది. మంచి రిథమ్‌లో ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాంటప్పుడే వరుస వికెట్లు తీసి జట్టు విజయంలో సాయపడగలం. ఉదయం సెషన్లో (రెండో రోజు) కూడా నేను నమ్మకంగా ఉన్నాను. కానీ వికెట్ దక్కలేదు. లంఛ్ తర్వాత మంచి రిథమ్‌తో బౌలింగ్ తీసి వికెట్లు పడగొట్టాను. " అని మ్యాచ్ అనంతరం అజాజ్ పటేల్ తెలిపాడు.
కాగా, మూడో టెస్టులోనూ భారత బ్యాటర్లు విఫలమయ్యారు. 147 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్ 25 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ కావడం ఇదే తొలిసారి. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ (6/57), గ్లెన్ ఫిలిప్స్ (3/42), మాట్ హెన్రీ (1/10) దెబ్బకు భారత బ్యాటర్లు విలవిల్లాడారు. భారత బ్యాటర్లలో రిషభ్ పంత్ (64) మినహా ఎవరూ రాణించలేదు. ఈ క్రమంలో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా అజాజ్ పటేల్, 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును విల్ యంగ్ సొంతం చేసుకున్నాడు.
4331 రోజుల తర్వాత భారత్‌కు తొలి ఓటమి- చరిత్ర సృష్టించిన కివీస్