ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్​పై ఆసీస్​ కన్ను- టీమ్​లో మార్పులు! కొత్త కెప్టెన్​గా మిచెల్​ మార్ష్​? - Australia T20 World Cup Captain

Australia 2024 T20 World Cup Captain : త్వరలో టీ20 వరల్డ్​కప్​ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా టీమ్​లో మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జట్టు కెప్టెన్​గా ప్యాట్​ కమిన్స్​ స్థానంలో మిచెల్ మార్ష్​కు పగ్గాలు అప్పగించేందుకు యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ వివరాలు మీకోసం.

Australia 2024 T20 World Cup Captain
Australia 2024 T20 World Cup Captain
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 11:46 AM IST

Updated : Mar 12, 2024, 12:00 PM IST

Australia 2024 T20 World Cup Captain : గతేడాది సొంత గడ్డపై జరిగిన 2023 ఐసీసీ వన్డే వరల్డ్​కప్​ ఫైనల్​లో భారత్​ను దెబ్బకొట్టింది ఆస్ట్రేలియా. టోర్నీ మొత్తంలో అద్భుతంగా రాణించిన టీమ్ఇండియా అనూహ్యంగా ఓడిపోవడం వల్ల ఆరోసారి మెగా టోర్నీ ఎగరేసుకుపోయింది కంగారూ జట్టు. అయితే త్వరలో జరగబోయే 2024 టీ20 వరల్డ్​కప్​లోనూ విజేతగా నిలవాలని ఆసీస్​ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే యాజమాన్యం, జట్టులో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం టీ20 ఫార్మాట్​కు కెప్టెన్​గా ఉన్న ప్యాట్ కమిన్స్​ స్థానంలో మిచెల్​ మార్ష్​కు సారథ్య బాధ్యతలు అప్పగించేదుకు బోర్డు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మిచెల్ మార్ష్‌కు టీ20 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌ డొనాల్డ్‌ ఆసీస్ క్రికెట్​ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జార్జ్‌ బెయిలీ అధ్యక్షుడిగా ఉన్న సెలెక్షన్‌ కమిటీలో సభ్యుడైన మెక్‌ డొనాల్డ్‌, మార్ష్‌ 2024 టీ20 ప్రపంచకప్​లో ఆసీస్‌ పగ్గాలు చేపట్టాలని బలంగా కోరుకుంటున్నాడని సమాచారం. మరోవైపు టీ20 కెప్టెన్సీ వదులుకునేందుకు ప్రస్తుత సారథి ప్యాట్‌ కమిన్స్‌ కూడా సుముఖంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్​గా మిచెల్​ మార్ష్​కు​ మంచి రికార్డు ఉంది. ఆరోన్‌ ఫించ్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన తొలి సిరీస్‌లోనే జట్టును విజయ పథంలో నడిపించాడు మార్ష్​. ఇక మార్ష్​ సారథ్యంలో, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2021-23 తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను క్లీన్​స్వీప్ చేసింది ఆసీస్​. ఈ కారణాలతో మిచెల్​ మార్ష్‌నే సారథిగా కొన‌సాగించాల‌ని ఆసీస్ బోర్డు, కోచ్‌లు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది జూన్ 1వ తేదీ టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లు మొదలు కానున్నాయి. జూన్ 6న జరగనున్న తన మొదటి మ్యాచ్​లో ఆస్ట్రేలియా, ప‌సికూన ఒమ‌న్ టీమ్​తో త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం జూన్ 9న డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్‌తో ఆసీస్​ మ్యాచ్​ ఆడనుంది.

'హార్దిక్​ లేకుండానే గుజరాత్​ స్ట్రాంగ్​గా ఉంది'- పాండ్యపై ఆసీస్​ మాజీ ప్లేయర్​ కీలక వ్యాఖ్యలు

WPL 2024 : చావోరేవో మ్యాచ్​లో యూపీ ఓటమి- ప్లేఆఫ్​ ఆశలు గల్లంతే

Last Updated : Mar 12, 2024, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.