AUS vs IND Border Gavaskar Trophy : క్రికెట్ టెర్మినాలజీలో అలాగే క్రీడాభిమానుల్లో తెగ నానిన మాటల్లో ఫాలో ఆన్ కూడా ఒకటి. గతంలో ఈ పదం బాగానే వినిపించేది. కానీ, ఇటీవల టెస్టుల్లోనూ దూకుడు ఎక్కువైన తర్వాతనే అలాంటి అవకాశమే టీమ్‌లకు రావట్లేదు. అయితే చాలా రోజుల తర్వాత భారత్ 'ఫాలో ఆన్' ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురుకానుంది. ఒకవేళ ఫాలో ఆన్ ఆడాల్సి వస్తే ఆసీస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం క్రీడాభిమానుల్లో అలాగే దిగ్గజ క్రికెటర్లలో ఆసక్తికర అంశంగా మారింది.
రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
ఎంసీసీ నివేదించిన రూల్స్ ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు మాత్రమే 'ఫాలో ఆన్'పైన తుది నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఆస్ట్రేలియా 445 పరుగులు స్కోర్ చేసింది. ఒక వేళ భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు కూడా చేయకపోతే ఫాలో ఆన్‌లో పడినట్లే. అయితే భారత్‌ను రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్‌కు ఆహ్వానించాలా? వద్దా? అనేది ఆస్ట్రేలియా ఇష్టం. అలాకాకుండా రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ ఆడాలని నిర్ణయం తీసుకొనే అవకాశం కూడా లేకపోలేదు.
పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడం అలాగే తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారనుకుంటే మాత్రమే 'ఫాలో ఆన్' ఆడించేందుకు ఆసీస్ సిద్ధపడుతుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 200 పరుగుల్లోపే ఆలౌట్ చేస్తే, ఇన్నింగ్స్ తేడాతో ఆసీస్ గెలిచినట్లే. అలాకాకుండా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 246 రన్స్ కంటే ఎక్కువ చేసిందని అనుకుంటే తప్పనిసరిగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది. అప్పుడు భారత్ ముందు లక్ష్యం నిర్దేశించి ఫలితం కోసం ఆలౌట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షం ఆటంకం కలిగిస్తున్న క్రమంలో భారత్ ఈ 'ఫాలో ఆన్' గండం దాటేస్తే ఇక ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్‌ను డ్రా చేసుకొనేందుకు మంచి అవకాశం దక్కుతుందని విశ్లేషకుల మాట.
'మీరు 11 మంది, నేను ఒక్కడినే చూసుకుందాం!' - ఆసీస్‌పై సచిన్ కామెంట్స్ వైరల్!!
చేసింది 3 పరుగులే అయినా బిగ్ రికార్డ్ బ్రేక్ - ద్రవిడ్‌ను అధిగమించిన కోహ్లీ!