Asia Badminton Championship 2024: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. నాలులు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్ 2024లో మహిళల సింగిల్స్‌లో చైనీస్ టాప్ సీడ్ హాన్ యుతో తలపడ్డ సింధు ఆటను 40 నిమిషాల్లోనే ముగించింది. హాన్ యుపై సింధు 21-17, 21-15 తేడాతో నెగ్గింది. దీంతో ఛాంపియన్షిప్స్ నాకౌట్లో చైనాతో తలపడ్డ భారత్ తొలి మ్యాచ్‌లోనే నెగ్గి 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లింది.
తర్వాత రెండో గేమ్ డబుల్స్‌లో తానిషా- అశ్విని పొన్నప్ప చైనా ద్వయం లియూ షెంగ్- తాన్ నింగ్ చేతిలో 19-21 16-21 తేడాతో ఓడారు. ఇక సింగిల్స్‌లో ప్రపంచ నెం.9 ర్యాంకర్ వాంగ్ జి ఈపై భారత షట్లర్ అష్మితా చలిహా 13-21 15-21 పరాజయం చవి చూసింది. దీంతో చైనా 1-2తో లీడ్‌లోకి వెళ్లింది. నాలుగో గేమ్ డబుల్స్‌లో తీస్రా జాలీ- గాయత్రి గోపిచంద్ చైనీస్ ద్వయం లియి జింగ్- లువో మిన్తో తలపడ్డారు. గంటా 9నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి భారత ద్వయానిదే పైచేయి అయ్యింది. ఈ గేమ్‌లో చైనాపై 10-21 21-18 21-17 తేడాతో తీస్రా- గాయత్రి ద్వయం నెగ్గడం వల్ల భారత్ 2-2తో సమం చేసింది.
డిసైడర్ గేమ్ సింగిల్స్‌లో 17ఏళ్ల అన్మోల్ ఖర్బ్ సంచలనం సృష్టించింది. వరల్డ్ 472 ర్యాంకరైన అన్మోల్, ప్రపంచ 149 ర్యాంకర్ లియో యుపై 22- 20, 14- 21, 21-18 తేడాతో నెగ్గి భారత్‌కు చరిత్రాత్మక విడయం కట్టబెట్టింది. దీంతో ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ నాకౌట్లో భారత్ 3-2తో విజయం సాధించి క్వాటర్ ఫైనల్స్‌కు చేరుకుంది.
మరోవైపు పురుషుల జట్టు కంప్లీట్ డామినెన్స్ చూపించింది. తొలి గేమ్ సింగిల్స్‌లో ప్రణయ్, లాంగ్ అంగుస్ చేతిలో 18-21 14-21 తేడాతో ఓడినప్పటికీ, తర్వాత మ్యాచ్‌ల్లో భారత్‌దే పైచేయిగా నిలిచింది. రెండో గేమ్‌లో లక్ష్యసేన్ 21-14 21-9 తేడాతో చాన్ యిన్‌పై నెగ్గగా, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి 21-16 21-11 తేడాతో లియి చున్- యెంగ్ షింగ్‌పై గెలుపొందారు. దీంతో మూడు మ్యాచ్‌ల తర్వాత భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత గేమ్స్‌లోనూ భారత్ అదే జోరు ప్రదర్శించింది. వరుసగా నాలుగు, ఐదు గేమ్స్‌లో అర్జున్- ధ్రువ్ కపిల 21-12 21-7 (డబుల్స్)తో, కిదాంబి శ్రీకాంత్ (సింగిల్స్) 21-14 21-18 తేడాతో నెగ్గడం వల్ల భారత్ 4-1తో ముగించింది.
ఫైనల్లో తప్పని నిరాశ - పోరాడి ఓడిన సాత్విక్, చిరాగ్ జోడీ
రిలేషన్షిప్ స్టేటస్‌పై స్పందించిన పీవీ సింధు- 'లవ్ లైఫ్' గురించి క్లారిటీ!