Ashwin Wife Interview : చెన్నై వేదికగా జరిగిన భారత్- బంగ్లాదేశ్ తొలి టెస్ట్‌లో టీమ్ఇండియా విజయం సాధించింది. యంగ్ నుంచి సీనియర్ ప్లేయర్లందరూ ఎంతో అద్భుతంగా ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అటు బ్యాట్‌తో పాటు ఇటు బాల్‌తోనూ సత్తా చాటాడు.
అయితే ఈ మ్యాచ్ తర్వాత అశ్విన్‌కు తన భార్య ప్రీతి నుంచి మాత్రం కాస్త క్లిష్టమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి యాష్ ఇచ్చిన సమాధానాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారిపోయింది.
ప్రీతి : డాటర్స్ డే రోజు ఏం ఇస్తారంటూ పిల్లలు అడుగుతున్నారు?
అశ్విన్ : వారికి నేను ఓ స్పెషల్ గిఫ్ట్‌ను ఇస్తున్నా. ఫైఫర్ పెర్ఫామెన్స్ చేసిన ఈ బాల్‌ను వారికి ఇస్తాను.
ప్రీతి : సొంత మైదానంలో ఇటువంటి పెర్ఫామెన్స్ చేయడం మీకు ఎలా అనిపిస్తోంది?
అశ్విన్ : ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ డే చాలా త్వరగానే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అసలు క్రీజ్‌లోకి వస్తానని నేను అనుకోలేదు. సెంచరీ గురించి నాకు ఆలోచనే లేదు. ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటుంటే భలే అనిపిస్తోంది. ప్రతిసారీ నాకు ఇక్కడ స్పెషల్‌గా అనిపిస్తుంది. నన్ను ముందుకునడిపించే శక్తి ఏదో ఇక్కడ ఉందేమో నాకైతే తెలియదు కానీ, సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమే.
3A special game calls for a special conversation 💙@ashwinravi99's family in a heartwarming interaction with him post Chepauk heroics.
— BCCI (@BCCI) September 22, 2024
P.S. - Ashwin has a gift for his daughters on this #DaughtersDay.
Watch 👇👇#INDvBAN | @IDFCFIRSTBank | @prithinarayanan pic.twitter.com/4rchtzemiz
ప్రీతీ : మ్యాచ్ ఫస్ట్ డే మాకు కనీసం హాయ్ కూడా చెప్పలేదు. ఇప్పుడీ పెర్ఫామెన్స్ నీలో మరింత ఎనర్జీని పెంచిందని అనుకుంటున్నావా?
అశ్విన్ : తొలిరోజు నీ (ప్రీతీ) వైపు కనీసం చూడలేదని అంటున్నావు కదా. నేను అలా చేయకపోవడానికి ఓ రీజన్ ఉంది. నేను మ్యాచ్ ఆడే సమయంలో ఫ్యామిలీ మెంబర్స్‌ను పలకరించడం, చూడటం నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మ్యాచ్ మధ్యలో దాని గురించి అవగాహన ఉంది. అప్పుడప్పుడు పిల్లలు కూడా 'నువ్వు ఎందుకు హాయ్ చెప్పలేదు' అని నన్ను అడుగుతుంటారు. ఇక్కడ డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. మ్యాచ్ టైమ్‌లో హాయ్ చెప్పలేను. మీరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆ సీట్లలోనే కూర్చొని ఉంటారు. మ్యాచ్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అటువంటి సమయంలో నేను ఆటపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
Ash Anna delivers the perfect #DaughtersDay gift! ♥️#RaviAshwin #INDvBAN #PunjabKings pic.twitter.com/96lvgAUDXD
— Punjab Kings (@PunjabKingsIPL) September 22, 2024
ప్రీతీ : కంగ్రాట్స్. చెపాక్‌లో రెండో సెంచరీ, ఐదు వికెట్ల పెర్ఫామెన్స్ చేసినందుకు అభినందనలు. పిల్లలు కూడా ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు.
అశ్విన్ : థాంక్యూ. ఇక్కడ ఉన్నందుకు నాకు లక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్.
అశ్విన్@6- తొలి టెస్ట్‌లో బంగ్లాపై భారత్ ఘన విజయం - India Vs Bangladesh 1st Test