Ashwin On Rohit Sharma: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 2-0 తేడాతో భారత్ ఓడడం వల్ల టీమ్ సెలక్షన్‌పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. రోహిత్ 157 పరుగులతో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలానే రెండు జట్లకు చెందిన అందరు బ్యాటర్ల కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ 141.44తో పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోలేక అందరు బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుంటే, ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
తాజాగా భారత్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో తాజాగా అశ్విన్ రిలీజ్ చేసిన వీడియోలో రోహిత్ బ్యాటింగ్ గురించి మాట్లాడాడు. 'శ్రీలంక సిరీస్‌లో నాకు ప్రత్యేకంగా అనిపించింది రోహిత్ శర్మ బ్యాటింగ్. ఎలాంటి పరిస్థితుల్లోనూ భయం లేదు, రోహిత్ అంటేనే ఐ యామ్ గోయింగ్ టూ హిట్ అని అర్థం. బ్యాటర్‌గా రోహిత్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు' అని పేర్కొన్నాడు.
ఇటీవల తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో దిండిగల్ డ్రాగన్స్‌ను విజయం అందించిన అశ్విన్, క్రీజులో రోహిత్ వెర్సటాలిటీని హైలైట్ చేశాడు. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఛాలెంజింగ్ పిచ్‌పై రోహిత్ సక్సెస్ కావడానికి గల కారణాలు వివరించాడు. స్వీప్స్, రివర్స్ స్వీప్స్, ఫాస్ట్ బాల్స్‌పై అగ్రెస్సివ్ స్ట్రోక్స్ సహా వివిధ షాట్‌లు ఆడగల రోహిత్ సామర్థ్యం కీలకమని పేర్కొన్నాడు.
అదే పిచ్‌పై ఇతర బ్యాటర్లు సెటిల్ అవ్వడానికి, పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారని అశ్విన్ తెలిపాడు. 'రోహిత్ శర్మ స్క్వేర్ ఆడుతాడు, స్వీప్ చేస్తాడు, రివర్స్ స్వీప్స్ ట్రై చస్తాడు, ఫాస్ట్ బాల్స్ ఆడేటప్పుడు, ముందుకొచ్చి కొడతాడు. రోహిత్ ఆప్షన్స్‌ని క్రియేట్ చేసుకుంటాడు' అని చెప్పాడు.
టీమ్‌ఇండియా షెడ్యూల్ ఏంటి?
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఇంగ్లాండ్, భారత్‌లో పర్యటించనుంది. అంటే భారత జట్టు వచ్చే ఏడాది జనవరి వరకు ఎలాంటి వన్డేల్లో పాల్గొనదు. ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఊహించిన విధంగానే స్లో పిచ్‌లు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో అలాంటి పిచ్‌లపై తమ బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకునే యోచనలో భారత్ కనిపిస్తోంది. రోహిత్ శర్మ విషయానికొస్తే, అతడి ఆటతీరులో పెద్దగా మార్పులు ఆశించడం లేదు. అతడు అన్ని ఫార్మాట్స్‌లో తన దూకుడు బ్యాటింగ్ విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
ICC ర్యాంకింగ్స్: సత్తాచాటిన రోహిత్, గిల్, విరాట్- టాప్ 5లో ముగ్గురు మనోళ్లే - ICC Ranking
'రిస్క్ చేయడానికి భయపడను- ఆ విషయంలో తగ్గేదేలే' - Rohit Sharma