Anil Kumble Birthday : టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తించడంలో దిట్టగా పేరుపొందాడు. ఇలా రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు విశేష సేవలందించాడు. అయితే గురువారం అనిల్ కుంబ్లే 54వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో కుంబ్లే సాధించిన రికార్డులు, నెట్‌వర్త్ తదితర విషయాలు తెలుసుకుందాం.
ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు
1999లో దిల్లీ వేదికగా భారత్- పాకిస్థాన్ టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో 420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలో బాగానే ఆడింది. వికెట్ కోల్పోకుండా 101 పరుగులు చేసింది. కానీ, అక్కడి నుంచే కుంబ్లే తన ప్రతాపాన్ని చూపెట్టాడు. ఏకంగా ఆ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లను పడగొట్టాడు. దీంతో పాక్ 207 పరుగులకే కుప్పుకూలింది. మొత్తం ఈ ఇన్నింగ్స్‌లో కుంబ్లే 74 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. కుంబ్లే సంచలన ఇన్నింగ్స్‌తో ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 212 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఆ మ్యాచ్ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.
దవడ గాయంతోనే
2002లో భారత జట్టు వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే దవడకు గాయమైంది. అయినా జట్టు కోసం మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేశాడు. 14 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. విండీస్ దిగ్గజం బ్రియన్ లారాదే ఆ వికెట్. అంతలా భారత జట్టు కోసం కుంబ్లే కష్టపడ్డాడు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
టెస్టులో అదుర్స్
అనిల్ కుంబ్లే భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 600 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇందులో 38 సార్లు 5 వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో ఓ సెంచరీ కూడా చేశాడు. అలాగే 271 వన్డేల్లో 337 వికెట్లు తీశాడు.
నెట్ వర్త్
అనిల్ కుంబ్లే నెట్‌వర్త్ రూ. 80 కోట్లని ప్రముఖ వెబ్ సైట్లు అంచనా వేశాయి. జీతం, ఎండార్స్‌మెంట్‌లు, ఐపీఎల్ కాంట్రాక్టులు, బీసీసీఐ, వ్యక్తిగత వ్యాపారాల ద్వారా అనిల్‌కు ఆదాయం వస్తున్నట్లు తెలిపాయి. కుంబ్లేకు బెంగళూరులో లగ్జరీ హౌస్ కూడా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అనేక ఆస్తులు ఉన్నాయి.
Thank you so much! https://t.co/BOXf12ovwt
— Anil Kumble (@anilkumble1074) October 17, 2024
మహిళా క్రికెటర్లలో ఈ కెప్టెన్ చాలా రిచ్! - హర్మన్‌ప్రీత్ నెట్‌వర్త్ ఎంతంటే?
సచిన్, ధోనీకంటే అత్యంత ధనిక క్రికెటర్! - విరాట్‌కు ఈయన ఓసారి ఇళ్లు అద్దెకు ఇచ్చారట!