ETV Bharat / sports

అండర్సన్​ @ 700: టెస్టుల్లో తొలి పేసర్​గా రికార్డ్- సచిన్ స్పెషల్ ట్వీట్ - anderson 700 wickets test career

Anderson 700 Wickets: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టు కెరీర్​లో 700 వికెట్లు క్లబ్​లో చేరాడు. ఈ క్రమంలో అండర్సన్​కు పలువురు మాజీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

anderson 700 wickets
anderson 700 wickets
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 1:09 PM IST

Updated : Mar 9, 2024, 1:20 PM IST

Anderson 700 Wickets: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టు కెరీర్​లో అరుదైన ఘనత అందుకున్నాడు. ధర్మశాల టెస్టులో రెండు వికెట్లు తీసిన అండర్సన్ ఈ ఫార్మాట్​లో 700 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రంలో 700 వికెట్ల క్లబ్​లో చేరిన తొలి పేసర్​గా అండర్సన్ రికార్డు కొట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఇంగ్లాండ్​ పేసర్​పై పలువురు మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూడా అండర్సన్​కు శుభాకాంక్షలు తెలిపాడు.

2002లో అండర్సన్ బౌలింగ్​ను తొలిసారి చూసిన సందర్భాన్ని ​తెందూల్కర్ గుర్తుచేసుకున్నాడు. '2002 ఆస్ట్రేలియాలో అండర్సన్​ ఆడడాన్ని నేను తొలిసారి చూశాను. బంతిని అండర్సన్​ నియంత్రించిన తీరు స్పెషల్​గా అనిపించింది. నాజిర్ హుస్సేన్ అతడి గురించి చాలా గొప్పగా మాట్లాడేవాడు. 700 వికెట్ల ఘనత సాధించడం గొప్ప విషయం. ఓ ఫాస్ట్ బౌలర్ 22ఏళ్లుగా కెరీర్​లో నిలకడగా రాణిస్తూ 700 వికెట్ల ఘనత అందుకోవడం కల్పితంగా అనిపించేది. కానీ, అండర్సన్ దాన్ని నిజం చేశాడు' అని సచిన్ ట్వీట్​ చేశాడు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు

  • ముత్తయ్య మరళీధరన్ (శ్రీలంక)- 800 వికెట్లు
  • షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)- 708 వికెట్లు
  • జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్)- 700 వికెట్లు
  • అనిల్ కుంబ్లే (భారత్)- 619 వికెట్లు
  • స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్)- 604 వికెట్లు

2003లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకూ 187 మ్యాచ్​లు ఆడాడు. అందులో 700 వికెట్లు దక్కించుకున్నాడు. 32సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, 3సార్లు 10వికెట్లు ప్రదర్శనలు ఉన్నాయి. దీంతో ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా అండర్సన్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రస్తుత సిరీస్​లో అండర్సన్ 10 వికెట్లు దక్కించుకున్నాడు.

మ్యాచ్ విషయానికొస్తే, తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్లలో కుల్​దీప్ 5, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్​ బ్యాటింగ్ ఆర్డర్​ను కుప్పకూల్చారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్​లో 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (103 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ (110 పరుగులు) సెంచరీలతో అదరగొట్టారు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో భారత్​కు 259 పరుగుల ఆధిక్యం లభించింది.

సర్ఫరాజ్​పై మాజీ బ్యాటర్ ఫైర్ ​- 'ఆ చెత్త షాట్‌ ఇప్పుడు అవసరమా?'

477కు టీమ్ఇండియా ఆలౌట్‌ - ఆండర్సన్ 700 వికెట్ల రికార్డు

Last Updated : Mar 9, 2024, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.