2025 IPL Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌కి ఇంకా చాలా సమయం ఉంది. అందులోనూ ఐదు నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అప్పుడే రానున్న సీజన్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. చాలా మంది స్టార్ ప్లేయర్లు టీమ్‌లు మారే అవకాశం ఉంది. కొన్ని ఫ్రాంచైజీలు రోహిత్, పంత్ వంటి స్టార్స్‌పై కన్నేశాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ప్రచారాలు, ఐపీఎల్ 2025 అప్‌డేట్స్ చూద్దాం పదండి.
ముంబయికి దూరం కానున్న స్టార్లు!
ముంబయి ఇండియన్స్‌ని చాలా సంవత్సరాలు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తమ భుజాలపై మోశారు. ఫ్రాంచైజీని టాప్ పొజిషన్‌లో నిలపడంలో కీలక పాత్ర పోషించారు. కానీ, ఇప్పుడు ఈ ముగ్గురు స్టార్లు ఎంఐకి దూరం కానున్నట్లు ప్రచారం సాగుతోంది. 2025 వేలంలో రోహిత్, సూర్యను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.
గత సీజన్‌లో రోహిత్‌ను పక్కనపెట్టి, ఎప్పటి నుంచో ఉన్న తమను కాదని పాండ్యకి కెప్టెన్సీ ఇవ్వడం సూర్య, బుమ్రాకి నచ్చలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరూ ముంబయిని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ముంబయి రోహిత్ శర్మను వదిలేస్తే హిట్‌మ్యాన్ గుజరాత్ టైటాన్స్ లేదా దిల్లీ క్యాపిటల్స్‌లో చేరే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
చెన్నైకి రిషబ్ పంత్?
2016లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషభ్ పంత్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అదే ఫ్రాంచైజీతో కొనసాగుతున్నాడు. అయితే 2024లో పంత్ ప్రదర్శనపై దిల్లీ క్యాపిటల్స్ సంతోషంగా లేదు. మరోవైపు సీఎస్కే ధోనీ వారసుడి కోసం వెతుకుతోంది. రాబోయే సీజన్ ముందు ధోని, ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పవచ్చు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ పంత్‌ని కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉంది.
సొంత గూటికి రాహుల్!
ఐపీఎల్‌లో చాలా టీమ్‌లకు భారత కెప్టెన్లు ఉన్నారు. ఆర్సీబీ వంటి పాపులర్ టీమ్‌ని ఫాఫ్ డు ప్లెసిస్ నడిపిస్తున్నాడు. ఆర్సీబీకి ఇండియన్ కెప్టెన్ కావాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్లేయర్, లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ని ఆర్సీబీ కొనే ప్రయత్నాల్లో ఉందట. గత మూడు సీజన్లలో డూ ప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ ట్రోఫీ అందుకోలేకపోయింది.
అదానీ చేతికి గుజరాత్ టైటాన్స్!
2021లో గుజరాత్ టైటాన్స్‌లో మెజారిటీ వాటాను రూ.5625 కోట్లకు CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు జట్టు ఓనర్‌షిప్‌ను వదులుకునే ఆలోచనలో ఉంది. ముందు నుంచీ జట్టును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న అదానీ గ్రూప్, గుజరాత్‌ని దక్కించుకోనుంది. 2025 ఫిబ్రవరిలో దీనిపై స్పష్టత రానుంది.
నాలుగు ఫ్రాంచైజీల కెప్టెన్ల మార్పు!
2025 ఐపీఎల్‌లో దాదాపు నాలుగు ఫ్రాంచైజీల కెప్టెన్లు మారనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో ఆర్సీబీ, దిల్లీ, లఖ్‌నవూ, పంజాబ్ జట్లలో ఈ మార్పు ఉండవచ్చని క్రీడావర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఏం జరగనుందో స్పష్టత రావాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే!
ఫ్రాంచైజీలతో బీసీసీఐ కీలక సమావేశం
కాగా, IPL 2025 మెగా వేలానికి ఐదు నెలల సమయం ఉంది. అయితే ప్లేయర్ రిటెన్షన్ , జీతం పరిమితుల గురించి చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఫ్రాంచైజీ యజమానులతో సమావేశం కావాలని BCCI యోచిస్తోంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జులై 30 లేదా 31న సమావేశం జరిగే అవకాశం ఉంది.
రోహిత్‌కు ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ తిరిగి ఇచ్చేస్తారా? - Rohith Sharma Nita Ambani
వింబుల్డన్‌లో రోహిత్- హిట్‌మ్యాన్ క్లాసీ లుక్ అదుర్స్ - Rohit Sharma Wimbledon