ETV Bharat / spiritual

పూజించే తులసి మొక్క ఎండిపోతే ఏం జరుగుతుంది? - ఆ రోజున నీళ్లు పోస్తే అశుభమా ! - tulasi plant

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 12:18 PM IST

Tulsi Plant Terms : ఇంటి ఆవరణలో తులసి మొక్కను పూజించడం హిందూ సంప్రదాయం. కానీ, తులసి కోటను ఏ దిక్కులో ఉంచాలి, మొక్కను ఎలా పెంచాలో చాలా మందికి అవగాహన లేదు. తులసి మొక్క విషయంలో చాలా నియమాలున్నాయని పండితులు చెప్తున్నారు.

tulsi_plant_terms
tulsi_plant_terms (ETV Bharat)

Holy Basil : ఇంట్లో తులసి మొక్క ప్రత్యక్ష దైవంతో సమానం. ఆలయంలో విగ్రహాలు ఎంత పవిత్రమో ఇంట్లోని తులసి మొక్క కూడా అంతే పవిత్రం. మొక్కే కదా అని తీసి పారేయడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు పండితులు. తులసి మొక్క నాటడం మొదలుకుని, సంరక్షణ కూడా నియమాలతో కూడుకుని ఉంది. ఎవరైనా ఇంట్లో తులసి మొక్క పెంచుకోవాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎంతో భక్తిశ్రద్ధలతో నాటిన తులసి మొక్క అనుకోని పరిస్థితుల్లో ఎండిపోతే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

పెయిన్ కిల్లర్స్​ ఎక్కువగా వాడుతున్నారా? పసుపు, అల్లం, తులసి అద్భుత ఔషధం- ట్రై చేయండి!

ఇంట్లో తులసి మొక్క ఉంటే మీరు గుర్తుంచుకోవలసిన విషయాలివీ..

  • తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా వేదాలు చెప్తున్నాయి. తులసి మొక్కను లక్ష్మీ దేవి నివాసం అని కూడా నమ్ముతారు. తులసి మొక్క ఉన్న ఇళ్లలో, క్రమం తప్పకుండా తులసిని పూజించే ఇళ్లలో లక్ష్మీ దేవి, విష్ణువు ఆశీస్సులు ఉంటాయని విశ్వాసం. ఇంట్లో తులసి మొక్కను నాటినట్లయితే, కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి. తులసికి సంబంధించిన ఈ నియమాలను నిర్లక్ష్యం చేస్తే పేదరికం, దురదృష్టం తప్పదంటున్నారు.
  • తులసి మొక్కను నాటేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్ని దిశగా పరిగణించబడే దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం సరికాదు. తులసి కోట ఎల్లపుడూ ఎల్లప్పుడు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి.
  • తులసి మొక్కను నేరుగా భూమిలో నాటకుండా ఎల్లప్పుడూ ఒక కుండలో నాటుకోవాలి. అదే విధంగా సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయడం మంచిది కాదు.
  • తులసి మొక్కను ఎప్పుడూ చీకట్లో ఉంచొద్దు. సూర్యాస్తమయం తర్వాత, తులసి మొక్క పరోక్ష కాంతిని అందుకోవడానికి దాని దగ్గర ఎల్లప్పుడూ దీపం వెలిగించాలి.
  • తులసి కోట(మొక్క)ను బహిరంగ ప్రదేశంలో ఉంచాలి. అక్కడ ప్రత్యక్ష సూర్యకాంతి క్రమం తప్పకుండా అందుతుంది.
  • పడిపోయిన ఆకులను, ఎండిపోయిన కొమ్మలను ఎప్పుడూ విస్మరించవద్దు. వాటిని కడిగి, తులసి మొక్క చుట్టూ ఉన్న మట్టికి తిరిగి ఇవ్వాలి.
  • తులసి మొక్క ఎండిపోతే ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఎండిన తులసిని ఉంచడం వల్ల పేదరికం, దురదృష్టం కలుగుతుందని నమ్ముతారు. మొక్క స్థానంలో మరో మొక్కను నాటుకోవాలి. ఎండిన కొమ్మలను అదే మట్టికి అంకితం ఇవ్వాలి.
  • ఆదివారం నాడు తులసికి నీరు పోయడం మంచిది కాదు. ఈ రోజున తులసి ఆకులను తెంపడం కూడా అశుభం.
  • తులసి మొక్క చుట్టూ ఉన్న ప్రాంతం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తులసి దగ్గర ముళ్ల మొక్కలను అస్సలు ఉంచకూడదు.
  • తులసి ఆకులను తీసేటప్పుడు, వేళ్లను మాత్రమే ఉపయోగించాలి. వాటిని ఎప్పుడూ కత్తితో లేదా కత్తెరతో కత్తిరించవద్దు. పూజాది అవసరాలు, ఆరోగ్యరీత్యా వినియోగించే సమయంలో మాత్రమే తులసి ఆకులు పగటి వేళలో తీసుకోవచ్చు.
  • స్నానం చేయకుండా తులసి ఆకులను తాకడం అరిష్టం. స్నానం చేయకుండా తాకినా, ఆకులు తెంపినా అవి పూజలో ఆమోదయోగ్యంగా కావు అని పండితులు చెప్తున్నారు.

వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను ఈ దిక్కులో పెడితే లక్ష్మీ కటాక్షం! అదృష్టం మీ వెంటే! - Tulasi plant Vastu direction

తులసి కషాయం తాగితే జలుబు, దగ్గులతోపాటు 'ఒత్తిడి' మటుమాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.