ETV Bharat / spiritual

'మీ ఇంట్లో మల్లె చెట్టు ఈ దిక్కున.. కొబ్బరి చెట్టు ఆ దిక్కున ఉండాలి - లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?' - Vastu Tips for Trees in Home

author img

By ETV Bharat Features Team

Published : 2 hours ago

Vastu Tips for Trees in Home: మనం ఇంటి ఆవరణలో అనేక చెట్లను పెంచుతుంటారు. అయితే వీటిని ఏ దిక్కులో పెంచుతున్నామనేది ముఖ్యం అంటున్నారు వాస్తు నిపుణులు. మరి, మీ ఇంటి ఆవరణలో ఏ చెట్లు ఏ దిక్కులో ఉంటే అఖండ ధనలాభం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

vastu tips for trees in home
vastu tips for trees in home (ETV Bharat)

Vastu Tips for Trees in Home: హిందువుల్లో చాలా మంది వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలను బలంగా విశ్వసిస్తుంటారు. ఇంటి నిర్మాణం నుంచి మొదలు.. వస్తువుల వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, ఇంటి ఆవరణలో పెంచే చెట్లను ఎక్కడ పడితే అక్కడ పెంచేస్తుంటారు. కానీ.. ఇలా చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏ చెట్టును ఏ దిక్కులో పెంచాలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

"శంఖు చెట్టు అంటే లక్ష్మీ దేవి, విష్ణువు, పరమేశ్వరుడికి, నవగ్రహాల్లోని శనిభగవానుడికి ఇష్టం. ఇలాంటి శంఖు చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే వీరందరి అనుగ్రహం కలిగి అద్భుతంగా అదృష్టం కలిసివస్తుంది. ఐదు సోమవారాలు శివుడిని పూజించి శంఖు పూలను పారే నీటిలో వదిలేస్తే ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. మంగళవారం ఈ పూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే వ్యాపార పరంగా అభివృద్ధి కనిపిస్తుంది. బుధవారం విష్ణుమూర్తిని శంఖు పూలతో పూజిస్తే వ్యాపార, ఉద్యోగాల్లో తిరుగులేని విజయాలను వస్తాయి. శనివారం నవగ్రహాల్లోని శని విగ్రహం వద్ద శంఖు పూలను పెట్టి పూజించడం వల్ల జాతకంలో శని బలం లేకపోయినా బ్రహ్మాండంగా బలం పెరుగుతుంది. అందుకే శంఖు చెట్టు, పూలకు అంత ప్రాముఖ్యం ఉంది. ఇంటి ఆవరణలో ఈ చెట్టు పెంచినా, పూలతో పూజ చేసినా అద్భుతమైన విజయాలు సొంతం చేసుకోవచ్చు. శంఖు చెట్టును ఏ దిక్కులోనైనా పెంచుకోవచ్చు."

-మాచిరాజు కిరణ్ కుమార్, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు

కొబ్బరి, మామిడి: కొబ్బరి, మామిడి చెట్టును ఇంటి ఆవరణలో దక్షిణం దిక్కులో పెంచాలని కిరణ్ కుమార్ తెలిపారు. ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని వివరించారు.

పనస చెట్టు: పనస చెట్టును ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిదని తెలిపారు. ధన లాభం, కుటుంబ పరంగా అదృష్టం కలిసివస్తుందని చెప్పారు. ఇంటి ఆవరణలో తూర్పు దిక్కులో పెంచితే పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారని వివరించారు. దక్షిణం వైపు పెంచితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని వెల్లడించారు.

సంపంగి: సంపంగి చెట్టను ఇంటి ఆవరణలో పెంచితే అనేక లాభాలు ఉంటాయని.. దీనిని ఏ దిక్కులోనైనా పెంచుకోవచ్చని తెలిపారు.

మల్లెచెట్టు: మల్లెచెట్టును ఇంటి ఆవరణలో పెంచడం వల్ల అష్ట ఐశ్వరాలు కలిగి, విపరీతమైన ధనలాభం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తూర్పు, దక్షిణం దిక్కులో పెంచాలని సూచించారు.

దానిమ్మ, అరటి: దానిమ్మ, అరటి చెట్లను ఇంటి ఆవరణలో పెంచడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని తెలిపారు. ముఖ్యంగా దానిమ్మ అయితే, దాదాపు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారట. ఏ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్క ఉంటుందో అక్కడ లక్ష్మీ దేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుందని చెప్పారు. దానిమ్మ మొక్క తన నివాసమని లక్ష్మీ దేవి చెప్పినట్లుగా పద్మ పురాణంలో కూడా ఉందన్నారు.

ఇంకా కొందరికి బంధువులతో సంబంధాలు సరిగ్గా ఉండవు. ఎప్పుడూ ఏదో గొడవలు జరుగుతుంటాయి. అలాంటి వారు దానిమ్మ, అరటి మొక్కను ఇంటి ఆవరణలో తూర్పు వైపు పెంచాలని సూచించారు. ఇలా పెంచితే బంధువుల మధ్య సఖ్యత ఏర్పడుతుందని తెలిపారు. అలాగే దక్షిణం వైపు పెంచితే స్నేహితులతో లాభాలు కలుగుతాయని చెప్పారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మీ ఇంటి ముందు చెట్టు, గుడి ఉందా? - అయితే, మీకు ఈ నష్టాలు తప్పవట!! - Vastu Shastra for Main Entrance

"మహిళలు ఈ పనులు చేస్తే - భర్త సంపాదన భారీగా పెరిగిపోతుంది!" - Astrology Remedies for Money

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.