ETV Bharat / spiritual

మూఢం అంటే ఏంటి? - ఆ రోజుల్లో ఈ పనులు అస్సలే చేయకూడదు! - కానీ అవి చేయొచ్చట! - Importance of Moudyami 2024 - IMPORTANCE OF MOUDYAMI 2024

Moodami 2024 Importance: త్వరలో మూఢాలు ప్రారంభం కానున్నాయి. మరో పది రోజులు దాటితే మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు. పెళ్లిళ్ల నుంచి ఇతర ఫంక్షన్ల దాకా ఏ శుభకార్యాలూ చేయరు. అందుకే.. ఈ లోపే పూర్తి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మరి, ఏ పనులు చేయొచ్చు? ఏవీ చేయకూడదు? అసలు మూఢం అంటే ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Moodami 2024 Importance
Moodami 2024 Importance
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 12:34 PM IST

Dos and Donts in Moudyami 2024: ఉగాది తర్వాత నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరందుకున్నాయి. అయితే.. మరో పది రోజులు దాటితే మూఢం వచ్చేస్తోంది. మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు. దీంతో.. శుభకార్యాలు ఏవైనా ఉంటే ఈ లోగానే కానివ్వాలని పండితులు సూచిస్తున్నారు. మరి మూఢం అంటే ఏంటి? మూఢాలతో వచ్చే సమస్యేంటి? ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొద్దని ఎందుకు అంటారు? చేస్తే ఏమవుతుంది? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం..

మూఢం అంటే : పురాణాల్లో గ్రహాలు, వాటి సంచారానికి అధిక ప్రాధ్యానత ఉంది. మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలంకాని సమయాన్ని సూచిస్తుందట. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారట. ఈ సమయంలో శుభ కార్యాలు చేయకూడదని అంటారు. ఇక మూఢాలు రెండు రకాలు గురు మూఢం, శుక్ర మూఢం.

గురు మూఢమి/శుక్ర మూఢమి: గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది. అలా గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే.. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే.. ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం అంటారు. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదని పండితులు చెబుతున్నారు.

మూఢాల్లో చేయకూడని పనులు:

  • శుభగ్రహాలైన గురు, శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి, మూఢాల్లో వివాహాది శుభ కార్యాలు జరపకూడదని పండితులు చెబుతున్నారు.
  • లగ్నపత్రిక రాసుకోకూడదని, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదని అంటున్నారు.
  • పుట్టు వెంట్రుకలు తీయించడం, గృహ శంకుస్థాపనలు వంటి పనులు చేయకూడదని, అలాగే ఇల్లు మారడం వంటివి కూడా చేయకూడదని అంటున్నారు.

మూఢాల్లో ఇవి చేయొచ్చు

  • మూఢాల్లోనూ కొన్ని పనులు చేయవచ్చట. అవేటంటే..
  • అన్న ప్రాసన, ప్రయాణాలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
  • ఇంటి రిపేర్లు చేసుకోవడం, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం వంటి పనులు కూడా చేయొచ్చని అంటున్నారు.
  • నూతన ఉద్యోగాల్లో చేరడం, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయొచ్చని చెబుతున్నారు.

మూఢంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది?: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న దాని ప్రకారం.. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అశుభం వినాల్సి రావొచ్చని అంటున్నారు. ఏదైనా కష్టం కలగొచ్చని, ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అందుకే.. మూఢం సమయంలో ఏ శుభకార్యమూ తలపెట్టకూడదని అంటుంటారు.

Note: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఈ విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.