ETV Bharat / spiritual

ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - Weekly Horoscope In Telugu - WEEKLY HOROSCOPE IN TELUGU

Weekly Horoscope From 27th April to May 4th 2024 : 2024 ఏప్రిల్ 27 నుంచి మే 4వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

weekly-horoscope-from-21st-april-to-27-april-2024-in-telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 5:18 AM IST

Weekly Horoscope From 27th April to May 4th 2024 : 2024 ఏప్రిల్ 27 నుంచి మే 4వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. భవిష్యత్ కోసం డబ్బు పొదుపు చేయడానికి ప్రణాళికలు వేస్తారు. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ఆంతరంగిక విషయాలలో ఇతరుల జోక్యం కారణంగా సంబంధాలు దెబ్బ తింటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. స్థిరాస్తిలో పెట్టుబడులు పెడతారు. వ్యాపారస్తులు గొప్ప శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టడం అవసరం. రాజకీయనాయకులు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. శివునికి అభిషేకం చేయిస్తే శుభఫలితాలు ఉంటాయి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇంటాబయటా సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు శుభకాలం నడుస్తోంది.

భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. గతంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు విజయం సమీపంలో ఉంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలమైన సమయం. విద్యార్థులకు ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిధునరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వివాహితులకు ఇంట్లో సుఖం, శాంతి ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. మీ జీవిత భాగస్వామి వృత్తిలో పురోగతి సాధించడం మీకు గర్వకారణం అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది.

వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఎక్కువ పనిభారం ఉంటుంది. కానీ మీ ప్రతిభతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ లోపిస్తుంది. పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే పట్టుదల, కృషి అవసరం. రాజకీయ నాయకులు దైవబలంతో విజయం దిశగా పయనిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మేలు. ఉద్యోగస్తులకు స్దాన చలనం ఉంటుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు. మంచి విజయాలను అందుకుంటారు.

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి అనుకూలమైన సమయం. రాజకీయ నాయకులకు పదవీ యోగం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. మీ సన్నిహితులతో విహారయాత్రకు వెళతారు. అన్ని రంగాల వారికి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభసమయం. స్థిరాస్తి కొనుగోలు నిమిత్తం ధనవ్యయం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటాయి. విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం అంతగా సహకరించదు. తగిన విశ్రాంతి అవసరం. యోగా ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ప్రశాంతతను ఇస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆర్ధికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు రావచ్చు కానీ ఆదాయం పెరగడం వలన ఇబ్బంది ఉండదు.
వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. విద్యార్థులు ప్రణాళికతో చదివితే మంచి విజయాలను సాధిస్తారు.రాజకీయ నాయకులకు కలిసి వచ్చే కాలం. మిత్రుల సహాయంతో అనేక ఆదాయ వనరులను పొందుతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం మెరుగు పడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులు గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు తిరుగుండదు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలు ఉంటాయి. జీవిత భాగస్వామి సహకారంతో కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యాపారస్తులు బంధు మిత్రుల సహకారంతో ఆర్ధికంగా ఎదుగుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్త అందుతుంది. ఉద్యోగస్తులకు పురోభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటికి బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు. ఈ వారమంతా అన్నీ విజయాలే అంతా సంతోషమే! ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా పలు ప్రయోజనాలు ఉంటాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు, నూతన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసేవారికి విజయం వెన్నంటే ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉపాధి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. రాజకీయ నాయకులకు అందరి అండదండలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుకు అనువైన సమయం. శివారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గృహంలో శాంతి, సంతోషం, సౌఖ్యం ఉంటాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళతారు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మిత్రుల ద్వారా నూతన ఆదాయ వనరులు సమకూరుతాయి.

ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందా లు చేసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు . విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నూతన వస్త్ర, వాహన ప్రాప్తి ఉంది. రాజకీయ నాయకులు వివాదాలు దూరంగా ఉంటే మేలు. శని శ్లోకాలు పఠిస్తే సత్ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం అంతా శుభప్రదంగా ఉంటుంది. గృహంలో సంతోషం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొంచెం అహంకారం తగ్గించుకుంటే మేలు! లేకుంటే సన్నిహితులతో సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్థిరాస్తి, నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ఉద్యోగస్తులు ప్రమోషన్ అందుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు. స్థిరాస్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. పోటీకి సిద్ధమవుతున్న యువత మరింత కష్టపడాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. రాజకీయ నాయకులకు శుభ సమయం నడుస్తోంది. ఈశ్వర ఆరాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. రాజకీయ నాయకులు పోటీ తట్టుకోవాలంటే తీవ్రంగా శ్రమించాలి. ధన లాభం ఉంటుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చమవుతుంది. ఖర్చులు తట్టుకోడానికి పెట్టుబడులను ఉపసంహరిస్తారు. తీర్ధ యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.