Vastu Tips For For Iron Almirah : భారత సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మనం నివసించే గృహం కేవలం ఇల్లు మాత్రమే కాదు. అది మన జీవితం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా సొంత ఇళ్లు నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు. సొంత ఇళ్లు అనేది ఒక వ్యక్తికి కేవలం నీడ మాత్రమే కాదు. ఆ వ్యక్తికి ఇల్లు అనేది సర్వస్వం అవుతుంది. అందుకే ఇంటిని వాస్తు ప్రకారం నిర్మిస్తారు చాలా మంది. వాస్తు ప్రకారంగా ఇళ్లు నిర్మిస్తే, ప్రతికూల శక్తులు ప్రవేశించమని శాస్త్రం చెబుతోంది. అందుకే పురాణాల్లో సైతం వాస్తు రీత్యా గృహాలు నిర్మించుకున్నట్లు అనేక సంఘటనలు మనకు ఉన్నాయి.
వాస్తు శాస్త్రం అనేది ప్రాచీన శాస్త్రాల్లో ఒకటి. మన సనాతన ధర్మంలో ఆయుర్వేదం మనిషి శరీరానికి సంబంధించిన శాస్త్రం. అయితే వాస్తు శాస్త్రం అనేది నిర్మాణ రంగానికి చెందిన ప్రాచీన శాస్త్రం. వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు వేణుగోపాల్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
నైరుతి వైపు బీరువాలో నగదును పెట్టవచ్చా?
వాస్తు ప్రకారం నైరుతి మూలలో బీరువా పెట్టుకోవచ్చు కానీ అందులో బంగారం, నగదును దాచుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఉత్తర దిక్కులో మరో చిన్న బీరువా ఏర్పాటు చేసుకొని అందులో నగదు దాచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసిన బీరువా ఎత్తు నైరుతి బీరువా కన్నా కూడా తక్కువగా, దక్షిణం వైపు చూస్తూ ఉండాలని సూచన చేస్తున్నారు.
అయితే ఈ దిశలో ఏర్పాటు చేయటం వల్ల తప్పనిసరిగా ఇంట్లో అభివృద్ధి చూస్తారని, ఆర్థికంగా పడే కష్టాలు తొలగిపోతాయని, అలానే దీర్ఘకాలికంగా ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడతారని వాస్తు పండితులు చెబుతున్నారు. అంతేకాదు వస్త్రాలు పెట్టే బీరువాలో ఆభరణాలు పెట్టకూడదని కూడా అంటున్నారు.
ఈ తప్పులు అసలు చేయవద్దు
చాలామంది మహిళలు తాము బీరువాలో దాచుకునే పట్టు చీరల కిందనే బంగారు నగలు, అలాగే నగదును దాచుకుంటారు. అయితే ఈ పద్ధతి అంత సబబు కాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి విలువ తగ్గిపోతుందని, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఒకే బీరువాలో భద్రపరచకూడదని పండితులు సలహా ఇస్తున్నారు. అంతేకాదు డబ్బు దాచుకునే బీరువా పైన సూట్ కేసులు, పాత సామాన్లు వంటివి కూడా పెట్టకూడదని చెబుతున్నారు. ఒకవేళ మీరు అలా సామాన్లను దాచుకోవాలి అనుకుంటే నైరుతి మూలన ఏర్పాటు చేసిన బట్టల బీరువా పైన పెట్టువచ్చని ఆయన చెబుతున్నారు. అంతేకాదు నైరుతి దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి యజమాని నైరుతిలో ఉన్నటువంటి గదిలోనే పడుకోవాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఇంటి యజమాని నైరుతి గదిలో తూర్పు వైపు తలగడపెట్టి పశ్చిమ వైపు కాళ్లు పెట్టి నిద్రించాలని మాచిరాజు వేణుగోపాల్ చెబుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వంట గదిలో వాస్తు - ఈ టిప్స్ పాటించకపోతే ఇబ్బందే!
డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ వాస్తు టిప్స్‌తో సమస్య పరార్!