ETV Bharat / spiritual

వాస్తు దోషం: ఇంట్లో క్యాలెండర్ ఆ దిశలో ఉంటే అంతే - ఆర్థిక ఇబ్బందులు తప్పవట! - Vastu Tips For Calendar

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 2:15 PM IST

Vastu Tips For Calendar : ప్రతి ఇంట్లో క్యాలెండర్‌ తప్పకుండా ఉంటుంది. అందరూ దాన్ని ఏదో ఒక చోట గోడకు తగిలించేస్తారు. అయితే.. వాస్తు ప్రకారం ఇలా అస్సలు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి వాస్తు ప్రకారం క్యాలెండర్‌ ఏ దిశలో ఉండాలో మీకు తెలుసా?

Vastu Tips For Calendar
Vastu Tips For Calendar

Vastu Tips For Calendar : ఈ ప్రపంచం మొత్తం క్యాలెండర్ చుట్టూ తిరుగుతుంది. తేదీ మొదలు.. తిథి, రాశి, వారం వర్జ్యం అంటూ.. ప్రతిదానికీ క్యాలెండర్ చూడాల్సిందే. అందుకే.. ప్రతి ఇంట్లోనూ క్యాలెండర్ ఉంటుంది. అయితే.. జనాలు ఈ క్యాలెండర్‌ను ఎక్కడ ఉంచుతున్నారన్నది ముఖ్యమే అంటున్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో ఖాళీగా ఉన్న గోడకు క్యాలెండర్​ను వేలాడదీయడం మంచిది కాదంటున్నారు. వాస్తు ప్రకారం.. క్యాలెండర్‌ను కొన్ని దిక్కులలో పెట్టడం వల్ల దోషం కలుగుతుందట. అందుకే దీనిని సరైన దిశలో ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.

క్యాలెండర్‌ ఏ దిక్కులో ఉండాలి ?
మనలో చాలా మంది కొత్త సంవత్సరం మొదటి రోజునే ఇంట్లోని పాత క్యాలెండర్‌ను తొలగించి కొత్త దాన్ని ఏర్పాటు చేస్తుంటారు. అయితే, కొత్త క్యాలెండర్‌ను ఏర్పాటు చేసేటప్పుడే దానిని వాస్తు ప్రకారం, పడమర దిశలో ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా క్యాలెండర్‌ పడమర దిక్కులో ఉండటం వల్ల ఇంట్లో సిరిసంపదలకు ఎలాంటి లోటూ ఉండదని చెబుతున్నారు. అలాగే పడమర దిక్కును "ప్రవాహ దిశ" అని నమ్ముతారు. ఈ దిక్కులో క్యాలెండర్‌ ఉన్న వారింట్లో లక్ష్మీదేవి చల్లని చూపు ఉంటుందని పేర్కొన్నారు.

ఈ వాస్తు దోషాలు ఉంటే - అప్పుల్లో మునిగిపోవడం ఖాయమట! - Vastu Mistakes Can Drown Deep Debts

అలాగే క్యాలెండర్‌ను ఉత్తరం వైపున కూడా వేలాడదీయవచ్చు. ఈ దిక్కును కుబేరుడు ఉండే చోటుగా భావిస్తారు. క్యాలెండర్ ఇంట్లో ఈ దిశలో ఉండటం వల్ల కూడా ధనం, ధాన్యం సమృద్ధిగా ఉంటాయట.

ఏ దిక్కులో క్యాలెండర్ అస్సలు ఉండకూడదు ?
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో క్యాలెండర్‌ ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణం వైపు ఉండకూడదట. ఇలా ఉండటం వల్ల ఇంట్లో డబ్బులు ఎక్కువ రోజులు నిల్వ ఉండవని చెబుతున్నారు. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొని చాలా డబ్బులను వైద్యం కోసం ఖర్చు చేసే అవకాశం ఉంటుందట.

  • ఇంకా క్యాలెండర్ ఎప్పుడూ తలుపు వెనకాల వేలాడదీయకూడదు. అలాగే కిటికీ దగ్గర కూడా పెట్టకూడదట.
  • మీరు క్యాలెండర్‌ను మీ మెయిన్‌ డోర్‌ దగ్గర పెట్టకండి. ఎందుకంటే దీనివల్ల ఆటంకాలు ఏర్పడవచ్చు.
  • అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో వేలాడదీసిన క్యాలెండర్‌ గాలికి కదలకూడదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి.
  • దేవతల ఫొటోలు ఉండే క్యాలెండర్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఈ చిత్రాలు ఉండే క్యాలెండర్‌ ఉంట్లో ఉండకూడదు!

  • క్యాలెండర్‌లో పోరాటం లేదా యుద్ధం చేసే ఫొటోలు ఉండకూడదు.
  • మునిగి పోతున్న ఓడ ఉన్న చిత్రం క్యాలెండర్‌లో లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వినాయకుడిని ఈ 7 పత్రాలతో పూజిస్తే - మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి! - Offer Sacred Leaves to Lord Ganesh

వాస్తులో ఈశాన్యానికి ఎందుకంత ప్రాధాన్యం? ఆ దిశలో టాయిలెట్​ ఉండొచ్చా? - Significance Of Northeast In Vastu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.