ETV Bharat / spiritual

ఇంట్లో కరెంట్​ మీటర్ ఎక్కడ ఉండాలి? మెట్ల కింద పూజ గది కట్టొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? - Vastu Shastra For Home In Telugu

Vastu Shastra For Home In Telugu : మనిషి విజయవంతంగా జీవితం గడపడానికి, మనం నివసిస్తున్న ఇంట్లో సుఖ, సంతోషాలు ఉండడానికి వాస్తు ఎంతో ముఖ్యం. అయితే అలాంటి ఇంటి వాస్తు వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

Vastu Shastra For Home In Telugu
Vastu Shastra For Home In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 8:34 AM IST

Vastu Shastra For Home In Telugu : వాస్తు జీవితానికి చుక్కాని వంటిది. ఆ చుక్కాని సరిగ్గా ఉన్నప్పుడే గమ్యాన్ని చేరతాం. అందుకే ప్రతి ఒక్క విషయంలోనూ వాస్తును పాటించి ముందడుగు వేస్తే జీవితం, జీవనం సుఖంగా సాగిపోతుంది. ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది. ఆర్థిక కష్టాలు దూరమవుతాయి. అయితే, వాస్తు రీత్యా కొన్ని శాస్త్ర ప్రాతిపదిక నియమాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మనం నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడొచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడ ఉంచితే అంతా మంచే జరుగుతుంది. వాస్తు విధి విధానాలు పాటించడం వల్ల జరిగే మంచి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది వాస్తు అంటే ఇంటి నిర్మాణానికి చెందిన అంశమే అనుకుంటారు. కానీ, మన దైనందిన జీవితంలో ప్రతిదీ వాస్తు శాస్త్రం ప్రకారమే చేయాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. బ్యాంకుకు, దేవాలయానికి వెళ్లినప్పుడు, స్నానం చేసినప్పుడు కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి యజమాని స్నానం చేసినప్పుడు ఆ నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల దుష్కర్మ తొలగిపోతుంది. అలాగే దుష్కర్మ వినాశక చూర్ణం వేసుకుని స్నానం చేయడం మంచిది. అలాగే శనివారం ఆవునేతితో ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వెంకటేశ్వరస్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు. శుభవార్తలను వినే భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా రావిచెట్టుకు పంచదార, నీరు వేస్తే మంచిది. ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది.

ఇక మంగళవారం దక్షిణ దిక్కుకు ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించాలి. అక్కడ 11 సార్లు ప్రదక్షిణ చేసి, 11 సార్లు హనుమాన్ చాలిసా పటిస్తే ఆర్థిక సమస్యలు తీరతాయని పండితులు చెబుతున్నారు. ఇతర కష్టాలు మన దగ్గరికి రావని శాస్త్రం చెబుతోంది. ప్రదక్షిణలు చేసే సమయంలో 'రామ్ రామాయ నమః' అని ప్రార్థించాలి. అదేవిధంగా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లేటప్పుడు పశ్చిమ దిక్కుకు తిరిగి డబ్బు డిపాజిట్ చేయాలి. అదే సమయంలో లక్ష్మీదేవి మంత్రాన్ని జపించాలి.

ఇంట్లో వస్తువులకు వాస్తు
ఇంటి నిర్మాణమే కాదు లోపల అమర్చే వస్తువులు కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. కొత్తగా ఫ్రిజ్ కొంటే అది ఇంట్లో వాయువ్య దిక్కున మాత్రమే ఉంచాలి. అలా ఉంచటం వల్ల మంచి జరుగుతుంది. వంట గదిలో సూర్య రశ్మి పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యకిరణాలు ఇంటిలోకి ప్రవేశించడం వల్ల యోగవంతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఇక వంట గదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా మెట్ల కింద ఎలాంటి నిర్మాణాలు కాని, వస్తువులు కాని ఉంచకూడదు. అసలు మెట్ల కింద పూజ గది ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టకూడదు. ఇంటి కరెంటు మీటరు అగ్నేయ దిక్కున ఉండేలా చూసుకోవాలి. కరెంటు స్విచ్చులు ప్రతి గదిలో కుడివైపు ఆగ్నేయ దిక్కున మాత్రమే ఉండాలి.

గాలి వెలుతురు వచ్చేలా
ఇంటిలో నివసించేవారికి సూర్యుడి వేడి, గాలి తగలాలి. ఇంటిలోకి సూర్యుడి వెలుగు ప్రసరించకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏ ఇంట్లో సూర్య కిరణాలు ప్రసరిస్తాయో ఆ ఇల్లు దేదీప్యమానంగా వర్థిల్లుతుంది. గాలి, వెలుతురు వచ్చేలా ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. ఇక ఇంటి అలంకరణ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిస్టల్ గంటలు, చేపల ఎక్వేరియం ఇంట్లో ఉండటం మంచిది. చేపలు శుభసూచకం, నీరు మంగళకరం కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా లాఫింగ్ బుద్ధ వాకిలిని చూస్తున్నట్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వాస్తులో ఉండే ముఖ్యాంశాలు. మానసిక శాంతి, ఉల్లాసం, పురోగతి వంటి వాటి కోసం వాస్తును పాటించాలని పండితులు సూచిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీరు కొత్తగా ఇళ్లు కడుతున్నారా? ఈ వాస్తు నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు గ్యారెంటీ!

వాలెంటైన్స్​ డే వాస్తు - మీ లవర్​కు ఈ గిఫ్ట్స్​ ఇవ్వాలి, అలాంటివి ఇవ్వొద్దు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.