Vastu Mistakes Can Drown Deep Debts : వాస్తు నియమాలను పాటించపోతే ఇంట్లో అశాంతి, ఒంట్లో అనారోగ్యం మాత్రమేకాదు.. అప్పుల్లో కూడా మునిగిపోతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తెలిసీ తెలియక వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా చేసే కొన్ని తప్పుల వల్లే.. ఈ పరిస్థితి వస్తుందని అంటున్నారు. అందువల్ల వాస్తుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తున్నారు. మరి.. జనాన్ని అప్పుల పాలు చేసే తప్పులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అక్కడ డస్ట్‌బిన్ పెట్టకూడదు :
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువులను ఎక్కడ పెట్టాలి?, ఎక్కడ పెట్టకూడదు? అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. దీంతో.. కొన్ని వస్తువులను పెట్టకూడని చోట పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయట. అందులో డస్ట్‌బిన్ ఒకటని చెబుతున్నారు. కాబట్టి.. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇంటి బయట లేదా ప్రధాన ద్వారం వద్ద డస్ట్‌బిన్ ఎప్పుడూ పెట్టకూడదట. చెత్త డబ్బా మెయిన్ డోర్ దగ్గర ఉంచడం వల్ల.. ఇంట్లోకి సిరిసంపదలు తీసుకొచ్చే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని.. దుమ్ము, దూళి లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఇళ్లు శుభ్రంగా ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందని తెలియజేస్తున్నారు.
అద్దె ఇంట్లో వాస్తు చూసుకోవాల్సిందే! - లేదంటే ఆ సమస్యలు తప్పవట! - Vastu Tips for Rented Home
బెడ్‌పైన భోజనం చేయకూడదు :
కొంత మందికి బెడ్‌రూమ్‌లో బెడ్‌పైన కూర్చుని భోజనం చేసే అలవాటు ఉంటుంది. అయితే, ఈ అలవాటు వల్ల ఆ కుటుంబం అప్పుల్లో కూరుకుపోతుందని నిపుణులంటున్నారు. మంచంపై కూర్చుని తినడం వల్ల ఆ ఇంట్లో ఏ పని జరగకుండా అన్నీ ఆటంకాలే ఎదురవుతాయని చెబుతున్నారు. అందుకే ఇంట్లో అందరూ కలిసి డైనింగ్ టేబుల్‌పై కూర్చుని భోజనం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
నైట్ గిన్నెలు కడగాలి :
కొంత మంది నైట్ టైమ్ లో కిచెన్ లో పాత్రలు కడగకుండా అన్నీ అలాగే పెడుతుంటారు. అయితే, వాస్తు ప్రకారం రాత్రి సమయంలో వంటగదిలో మురికి పాత్రలు ఉండకూడదట. దీనివల్ల లక్ష్మీదేవి చల్లని చూపు ఇంటి నుంచి దూరమవుతుందని నిపుణులంటున్నారు. అందుకే.. ఎంత సమయం అయినర రాత్రి గిన్నెలన్నింటినీ శుభ్రం చేసి పడుకోవాలని సూచిస్తున్నారు.
ఇంకా..
- వాస్తు నియమాల ప్రకారం, సాయంత్రం పూట ఎవరికీ కూడా పాలు, పెరుగు, ఉప్పు ఇవ్వకూడదు. దీనివల్ల ఆ కుటుంబం రుణాల ఊబిలో చిక్కుకుంటుంది.
- అలాగే నైట్ టైమ్ లో స్నానాల గదిలో ఖాళీ నీటి బకెట్లను ఉంచవద్దు.
- కనీసం ఒక బకెట్లోనైనా నిండా నీళ్లు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ దూరమై అంతా శుభం జరుగుతుందని చెబుతున్నారు.
నోట్ : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వెస్ట్ ఫేస్ ఇంట్లో ఈ వాస్తు టిప్స్ తప్పక పాటించాలట! - అవేంటో మీకు తెలుసా?