Uses of Agarbatti in Daily Life: హిందూ సంప్రదాయంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజ సమయంలో తప్పకుండా దీప ధూపాలు సమర్పిస్తారు. అయితే.. ధూపం కోసం అగరబత్తీలు వెలిగిస్తారు. మరి.. వీటిని వెలిగిస్తే ఏమవుతుంది? పండితులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
భగవంతుడి ఆశీర్వాదం: పురాణాల ప్రకారం.. దేవుళ్లు ధూపాన్ని ఇష్టపడతారు. అందుకే దేవతలను ఆరాధించే సమయంలో ధూపం వేయడం వల్ల వారు సంతోషిస్తారని.. పూజా సమయంలో అగరబత్తీలు వెలిగించిన వారు భగవంతుడి ఆశీర్వాదం పొందుతారని పండితులు అంటున్నారు.
ప్రతికూల శక్తులను తరిమేందుకు: ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండేందుకు, ప్రతికూల శక్తిని తరిమికొట్టేందుకు పూజా సమయంలో అగరబత్తీలను వెలిగిస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం.. ఇంట్లో అగరబత్తీలను వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూలత ఉంటుందని.. ప్రశాంతత నెలకొంటుందని చెబుతున్నారు.
ప్రశాంతతను పెంచుతుంది: అగరబత్తీల సువాసన మనసును ఆహ్లాదపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ధ్యానం, ప్రార్థన లేదా యోగా సమయంలో వాటిని వెలిగించడం వల్ల మరింత ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారు.
మీ అరచేతిలో ఈ గుర్తులు ఉన్నాయా? - ఇవి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? - Lucky Signs on Palm
ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే..
గాలిని శుభ్రం చేస్తుంది: అగరబత్తీలు గాలిలోని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను చంపడంలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలెర్జీ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుందట. 2010లో దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిశోధకులు.. అగరబత్తీలు గాలిలోని బ్యాక్టీరియా స్థాయిలను గణనీయంగా తగ్గించాయని కనుగొన్నారు. కొన్ని రకాల అగరబత్తీలు వేరే వాటికన్నా ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
నాణ్యమైన నిద్ర: నిద్రలేమితో బాధపడేవారికి అగరబత్తీల సువాసనలు ప్రయోజనాలు చేకూరుస్తాయని అంటున్నారు. రాత్రి పడుకునే ముందు రెండు అగరబత్తీలను వెలిగిస్తే ప్రశాంతమైన, మెరుగైన నిద్ర పోతారని చెబుతున్నారు. 2016లో జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయం పరిశోధకులు అగరబత్తీల సువాసన ప్రభావాలను అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో క్యోటో విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ టాకెషి మియాజో పాల్గొన్నారు. అగరబత్తీల సువాసన నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని కనుగొన్నారు.
ఒత్తిడికి రిలీఫ్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఒత్తిడితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఇంట్లో అగరబత్తీలు వెలిగించడం వల్ల మనసుకు ప్రశాంత కలుగుతుందట. ఇది అరోమా థెరపీలో ఒక భాగమని.. అగరబత్తీల వాసన ఏ వ్యక్తిలోనైనా ఆందోళన, ఒత్తిడిని దూరం చేస్తుందని చెబుతున్నారు.
ఇమ్యూనిటీ పవర్: అగరబత్తీల కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. యూకలిప్టస్, లావెండర్, టీ ట్రీ, పుదీనా ఫ్లేవర్స్ గల అగరబత్తీలను వాడటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయని అంటున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి. కొన్ని జర్నల్స్‌లో పబ్లిష్ చేసినవి. వీటిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.