ETV Bharat / spiritual

16 నుంచి తిరుమలలో అద్భుత ఉత్సవాలు - ఈ రోజుల్లో స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు నశిస్తాయి! - Govindaraja Swamy Brahmotsavams - GOVINDARAJA SWAMY BRAHMOTSAVAMS

Sri Govindaraja Swamy Varshika Brahmotsavams: తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు టీటీడీ డేట్​ ఫిక్స్​ చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Sri Govindaraja Swamy Varshika Brahmotsavams

author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 5:14 PM IST

Sri Govindaraja Swamy Varshika Brahmotsavams: తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం డేట్​ ఫిక్స్ చేసింది.​ మే 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక‌, ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారికి, అమ్మవార్లకు వాహన సేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి..

  • మే16న గురువారం ఉదయం ధ్వజారోహణం, రాత్రి – పెద్దశేష వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది.
  • మే 17న శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనం, అదే రోజు రాత్రి హంస వాహన సేవ ఉంటుంది.
  • మే 18న శనివారం ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు.
  • మే 19న ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనం, అదే రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిస్తాడు.
  • మే 20న సోమవారం ఉదయం మోహినీ అవతారం, అదే రోజు రాత్రి గరుడ వాహనంపై మాఢవీధుల్లో ఊరేగుతూ ఏడుకొండల వాడు భక్తులకు అభయమిస్తాడు.

తిరుమల వేంకటేశ్వరస్వామి కళ్లు ఎప్పుడు ఎందుకు మూసి ఉంచుతారు? - కారణం ఇదేనట! - Fascinating Facts About Tirumala

  • మే 21న మంగళవారం ఉదయం – హనుమంత వాహనం, రాత్రి గజ వాహనంపై శ్రీవారు తిరుమల మాఢవీధుల్లో ఊరేగుతారు.
  • మే 22న బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహన సేవలు నిర్వహిస్తారు.
  • మే 23న గురువారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ ఉంటుంది.
  • మే 24న శుక్రవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం నిర్వహించనున్నట్టు టీటీడీ వివరాలు ప్రకటించింది.

ఆ రోజుతో శ్రీ గోవింద రాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి కానున్నాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక వీటితో పాటు అనేక ఉత్స‌వాల జాబితాను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్ల‌డించింది.

  • మే నెల 3వ తేది శుక్రవారం రోజు శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం జ‌ర‌గ‌నుంది.
  • 4వ‌ తేదీ శనివారం సర్వ ఏకాదశి పండగను జరపనున్నారు.
  • మే 12వ తేదీ ఆదివారం శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి నిర్వహిస్తారు.
  • మే 17 నుంచి 19వ తేదీ వరకు(శుక్రవారం - ఆదివారం) శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుపుతారు.
  • మే 22 బుధవారం రోజు నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి ఉంటుంది.
  • మే 23 గురువారం రోజున శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా! - IRCTC Tirumala Tour Package

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.