ETV Bharat / spiritual

వాస్తు: మీ ఇంట్లో స్వస్తిక్​ గుర్తును ఈ ప్రదేశంలో గీస్తే - అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది! - Swastik Symbol Significance - SWASTIK SYMBOL SIGNIFICANCE

Significance Of Swastik Symbol : ఓంకారం తరువాత హిందూ సంప్రదాయంలో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్. అయితే, స్వస్తిక్​ను ఇంట్లోని ఈ ప్రదేశాల్లో గీయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Swastik Symbol
Significance Of Swastik Symbol (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 11:47 AM IST

Significance Of Swastik Symbol : స్వస్తిక్​ గుర్తుకు చాలా ప్రత్యేకత ఉంది. అందుకే గృహప్రవేశాల సమయంలో, పెళ్లి పత్రికలలో, వాహన పూజలలో, నూతన యంత్రాలు వాడే సమయంలో ఈ గుర్తు ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్వస్తిక్.. విష్ణువు చేతిలో ఉండే సుదర్షణ చక్రం లాగే చెడును నివారించి శుభాలను కలిగిస్తుందని విశ్వసిస్తారు. అయితే, స్వస్తిక్​ను ఇంట్లోని ఈ ప్రదేశాల్లో గీయడం వల్ల కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారని, శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి స్వస్తిక్​ను ఇంట్లో ఎక్కడ గీయాలో ఈ స్టోరీలో చూద్దాం..

స్వస్తిక్‌ గుర్తు ప్రాముఖ్యత : హిందూ సంప్రదాయాలలో 'ఓం' తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నంగా స్వస్తిక్‌ గుర్తును భావిస్తారు. కేవలం హిందూ మతంలోనే కాకుండా ఈ స్వస్తిక్‌ గుర్తును బౌద్ధ, జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు. పంచభూతాల(భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశం)కు చిహ్నంగా ఈ గుర్తును పరిగణిస్తారు. ఓం కారాన్ని అక్షర రూపంలో రాయకుండా.. ఒక సింబల్‌ రూపంలో రాస్తే దానినే స్వస్తిక్‌ గుర్తు అని అంటారంటున్నారు. స్వస్తిక్‌ గుర్తును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ గుర్తు ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం స్వస్తిక్‌ గుర్తును ఇంట్లో గీయడం వల్ల నెగటివ్‌ ఎనర్జీ ప్రవేశించదని.. అలాగే ఇంట్లో వారిని కొన్ని రకాల సమస్యల నుంచి కాపాడుతుందని పండితులు చెబుతున్నారు.

వాస్తు : ఇంటి మేడపైన ఈ వస్తువులు అస్సలు పెట్టొద్దు! - ఆర్థిక సమస్యలు తప్పవు! - Vastu Tips Home

వాస్తు శాస్త్రం ప్రకారం స్వస్తిక్ చిహ్నాన్ని ఎక్కడ గీయాలి ?: ఈ గుర్తును ఇంట్లో చాలా ప్రదేశాలలో గీయవచ్చు. ప్రతి దానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు.

ప్రధాన ద్వారం : స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపు గోడపై గీయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని.. అలాగే ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని పండితులు చెబుతున్నారు. ఇంకా ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటున్నారు.

పూజా గది : స్వస్తిక్‌ గుర్తును పూజ గదిలో దేవుని చిత్ర పటాలకు ఎదురుగా లేదా దీపం వద్ద గీయవచ్చు. దీనివల్ల ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా, సుఖశాంతుల వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.

గది తలుపులు : ఇంట్లోని పూజ గది తలుపుల ఎగువ భాగంలో స్వస్తిక్‌ గుర్తును గీయడం మంచిది. ఇది ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీని వచ్చేలా చేస్తుంది. ఎల్లప్పుడూ స్వస్తిక్ గుర్తును గీయడానికి ఎరుపు, నారింజ లేదా గోధుమ రంగు వంటి రంగులను వాడండి.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఈ గుడిలోని తీర్థాన్ని తాగితే అనారోగ్యం దరిచేరదట! ఈ స్పెషల్​ ఆలయం ఎక్కడ ఉందంటే? - Aragonda Anjaneya Swamy Temple

ఆంజనేయుడి అనుగ్రహం లభించాలంటే - హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! - Hanuman Chalisa Chanting Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.