ETV Bharat / spiritual

ఏలినాటి శనితో బాధపడుతున్నారా? శనివారం ఈ పూజ చేస్తే దోషాలు మాయం! - shani pradosha pooja telugu

Shani Pradosha Pooja Telugu : ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పడుతున్నారా? తరచూ పనిలో ఆటంకాలు చికాకు పెడుతున్నాయా? మోకాళ్ల నొప్పులు, నరాల సంబంధిత రుగ్మతలు వేధిస్తున్నాయా? ఈ సమస్యల నుంచి విముక్తి కావాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

Shani Pradosha Pooja Telugu
Shani Pradosha Pooja Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 6:31 PM IST

Shani Pradosha Pooja Telugu : దేవదానవులు క్షీరసాగర మధనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకొని సమస్త లోకాలను రక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు. ప్రతి నెలలో మనకు త్రయోదశి తిథి రెండు సార్లు వస్తుంది. ఒకటి శుక్ల పక్షంలో, రెండోది కృష్ణ పక్షంలో. అయితే శనివారం త్రయోదశి తిథి మధ్యాహ్నం సమయంలో ఉంటే దాన్ని శని ప్రదోషం అంటారు. అదే శనివారం సూర్యోదయంతో త్రయోదశి తిథి ఉంటే ఆ రోజును శనిత్రయోదశి అంటారు.

శని ప్రదోష పూజ ఎవరు చేయాలి?
జాతకంలో ఏమైనా దోషాలు అనగా వివాహ, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఉన్నవారు శని ప్రదోషం రోజున శివారాధన చేయడం ద్వారా ఆ దోషాలను తొలగించుకోవచ్చు.

సకల పాపహరణం- శివారాధన సకల దేవతారాధన!
శని ప్రదోష పూజ చేసిన వారికి గత జన్మలో చేసిన పాపాలు పోవడమే కాకుండా సకల సంపదలు చేకూరుతాయి. శనివారం వచ్చే ప్రదోషం రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. అంతేకాదు ప్రదోష కాల పూజ చేస్తే ఒక్క శివుడిని మాత్రమే కాదు సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

శని ప్రదోష పూజ ఎలా చేయాలి?
శనివారం మధ్యాహ్నం త్రయోదశి తిథి ఉన్న రోజున సాయంత్రం 4.30 నుంచి 6 వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో ఆవుపాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలు సమర్పించుకుని శివాష్టకం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సమస్త జాతక దోషాలు పోతాయి. అనారోగ్య సమస్యలు పోతాయి.

అభిషేకం చేయించలేని వారు ఏమి చేయాలి?
ప్రదోషంలో శివాభిషేకం చేయడానికి వీలు కాని వారు కనీసం తమ ఇంట్లో ప్రదోష వేళలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే ఆ శివయ్య కరుణించి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. సమస్త దోషాలను పోగొట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు.

ఓం నమః శివాయ

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.