ETV Bharat / spiritual

పోలి పాడ్యమి నుంచి సోమావతి అమావాస్య వరకు- మార్గశిర మాసంలో విశేషమైన రోజులు ఇవే!

మార్గశిర మాసంలో విశేషమైన పండుగలు, పుణ్య తిధులు

Margasira Masam Festivals
Margasira Masam Festivals (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Margasira Masam Festivals : శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మాసాలలోకెల్లా మార్గశిర మాసం అత్యుత్తమమైనది. మార్గశిర మాసానికి నిజంగానే అంత ప్రాముఖ్యం ఉంది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే మార్గశిర మాసంలో అనేక విశేషమైన పర్వదినాలు, పుణ్యతిథులు ఉన్నాయి. మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆధ్యాత్మికత వెల్లివిరిసే మార్గశిరం
తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ 2 వ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమితో మార్గశిర మాసం మొదలై డిసెంబర్ 30 వ తేదీ సోమవారం మార్గశిర అమావాస్యతో ముగుస్తుంది.

  • డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అమావాస్య: ఈరోజుతో కార్తిక మాసం ముగుస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు కల్ప వృక్ష వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది.
  • డిసెంబర్ 2వ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమి: పోలి పాడ్యమి. ఈరోజు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు. ఈరోజు నదీ స్నానం అత్యంత పవిత్రం. ఇదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి జ్యేష్ఠ కార్తె ప్రారంభమవుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు పల్లకీ ఉత్సవం, వ‌సంతోత్స‌వం జరుగుతాయి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజవాహన సేవ జరుగుతుంది.
  • డిసెంబర్ 3 వ తేదీ మంగళవారం మార్గశిర శుద్ధ విదియ: చంద్ర దర్శనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌భూపాల వాహ‌నం, మధ్యాహ్నం స్వర్ణరథం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగుతాయి.
  • డిసెంబర్ 4 వ తేదీ బుధవారం మార్గశిర శుద్ధ తదియ: తిరుమంగైయాళ్వార్ ఉత్సవం ప్రారంభం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతాయి.
  • డిసెంబర్ 5 వ తేదీ గురువారం మార్గశిర శుద్ధ చవితి: మార్గశిర లక్ష్మీవార వ్రతం మొదటి వారం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ జరుగుతాయి.
  • డిసెంబర్ 6 వ తేదీ శుక్రవారం మార్గశిర శుద్ధ పంచమి: పంచమి తీర్ధం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం పద్మసరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
  • డిసెంబర్ 7 వ తేదీ శనివారం మార్గశిర శుద్ధ షష్టి: సుబ్రహ్మణ్య షష్టి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో స్కంద షష్ట్యుత్సవం.
  • డిసెంబర్ 8 వ తేదీ ఆదివారం మార్గశిర శుద్ధ సప్తమి: భానుసప్తమి.
  • డిసెంబర్ 11 వ తేదీ బుధవారం మార్గశిర శుద్ధ ఏకాదశి: మోక్షద ఏకాదశి, సర్వ ఏకాదశి, గీతాజయంతి.
  • డిసెంబర్ 12 వ తేదీ గురువారం మార్గశిర శుద్ధ ద్వాదశి: మార్గశిర లక్ష్మీవార వ్రతం రెండో వారం. మత్స్య ద్వాదశి. తిరుమలలో చక్రతీర్ధ ముక్కోటి.
  • డిసెంబర్ 13 వ తేదీ శుక్రవారం మార్గశిర శుద్ధ త్రయోదశి: పక్ష ప్రదోషం. హనుమద్వ్రతం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో కృత్తికా దీపోత్సవం.
  • డిసెంబర్ 14 వ తేదీ శనివారం మార్గశిర శుద్ధ చతుర్దశి పౌర్ణమి: శ్రీ దత్తాత్రేయ జయంతి. ఈ రోజు సాయంత్రం నుంచి పౌర్ణమి తిథి రావడం వల్ల ఈ రోజునే దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
  • డిసెంబర్ 15 వ తేదీ ఆదివారం మార్గశిర శుద్ధ పౌర్ణమి/ పాడ్యమి: ధనుస్సంక్రమణం. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తిక దీపోత్సవం. కపిల తీర్ధ ముక్కోటి.
  • డిసెంబర్ 16 వ తేదీ సోమవారం మార్గశిర బహుళ పాడ్యమి: ధనుర్మాసం ప్రారంభం. తిరుప్పావై. కాత్యాయనీ వ్రతం ఆరంభం
  • డిసెంబర్ 18 వ తేదీ బుధవారం మార్గశిర బహుళ చవితి: సంకష్టహర చతుర్థి
  • డిసెంబర్ 22 వ తేదీ ఆదివారం మార్గశిర బహుళ సప్తమి: భానుసప్తమి
  • డిసెంబర్ 25 వ తేదీ బుధవారం: క్రిస్మస్ పండుగ
  • డిసెంబర్ 26 వ తేదీ గురువారం మార్గశిర బహుళ ఏకాదశి: సర్వ ఏకాదశి
  • డిసెంబర్ 28 వ తేదీ శనివారం మార్గశిర బహుళ త్రయోదశి: శని త్రయోదశి, శని ప్రదోషం.
  • డిసెంబర్ 29 వ తేదీ ఆదివారం మార్గశిర బహుళ చతుర్దశి: మాస శివరాత్రి.
  • డిసెంబర్ 30 వ తేదీ సోమవారం మార్గశిర బహుళ అమావాస్య: సోమావతి అమావాస్య, ధర్మ అమావాస్య . ఈరోజుతో మార్గశిర మాసం ముగుస్తుంది. ఎన్నో విశేషమైన పర్వదినాలు, వ్రతాలు, పూజలకు నిలయమైన మార్గశిర మాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా పండుగలు, వ్రతాలు ఆచరిద్దాం. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం. శుభం భూయాత్!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.