ETV Bharat / spiritual

మహాశివరాత్రి ​: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని పూజించాలో మీకు తెలుసా? - Mahashivratri Importance

Mahashivratri 2024 : పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ పవిత్రమైన రోజు శివ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ముక్కంటిని పూజిస్తారు. కాగా, శివరాత్రి నాడు ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Shivaratri
Mahashivratri 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 10:37 AM IST

Mahashivratri 2024 : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షం చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటాం. ఈ ఏడాది మార్చి 8న మహా శివరాత్రి వస్తోంది. ఈ పర్వదినం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే శివ భక్తులు ఈ రోజు అత్యంత నియమ నిష్ఠలు, భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు. ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు. అయితే, శివరాత్రి(Mahashivratri) రోజు అన్ని నియమాలు పాటించడంతో పాటు.. మీ రాశికి అనుగుణంగా ఉన్న జ్యోతిర్లింగాన్ని పూజించినప్పుడే ఉత్తమ ఫలితాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. అలాగే ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ, మహాశివరాత్రి రోజు ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని పూజించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మేషం : ఈ రాశివారు రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని పూజిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. మేషరాశిని అంగారకుడు పాలిస్తాడు. ఇది ధైర్యం, నిర్ణయాత్మకతకు ప్రసిద్ధి చెందిన రాశి. తమిళనాడులో ఉన్న రామేశ్వరం జ్యోతిర్లింగం స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ రాశి వారు గ్రహపీడా నివారణార్థం రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచిదని చెబుతున్నారు పండితులు.

వృషభం : ఈ రాశివారు పూజించాల్సిన లింగం.. మల్లికార్జున జ్యోతిర్లింగం. వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఇది స్థిరత్వం, అందం, ప్రశంసలకు ప్రసిద్ధి చెందిన రాశి. ఈ గుణాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున జ్యోతిర్లింగంలో ప్రతిబింబిస్తాయి. శివరాత్రి రోజు వృషభ రాశివారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు పండితులు.

మిథునం : ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని మిథునరాశి వారు పూజించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు పండితులు. ఈ రాశిని బుధుడు పరిపాలిస్తాడు. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది మధ్యలో హిందూ చిహ్నం 'ఓం' ఆకారం రూపంలో ఉన్న ద్వీపంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది.

కర్కాటకం : ఈ రాశివారు పూజించాల్సిన శివలింగం భీమశంకర్ జ్యోతిర్లింగం. కర్కాటకరాశిని చంద్రుడు పరిపాలిస్తాడు. ఇది భావాలను, అంతర్ దృష్టిని సూచిస్తుంది. మహారాష్ట్రలోని పుణెకు సమీపంలో ఉన్న భావగిరి గ్రామంలో భీమశంకర్ జ్యోతిర్లింగం ఉంది. నిత్యం ఈ జ్యోతిర్లింగం నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. శివరాత్రి రోజు ఈ రాశివారు ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు పండితులు.

సింహం : వీరు ఆరాధించాల్సిన జ్యోతిర్లింగం.. సోమనాథ్. సూర్యుడు సింహరాశికి అధిపతి. వీరు రాజ్యం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్‌లో ఉంది. అలాగే ఈ రాశి దృఢత్వం, గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. ఇక శివరాత్రి రోజు ఈ రాశివారు ఈ శివలింగాన్ని దర్శించుకున్నా, ఆరాధించినా పుణ్య ఫలాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

కన్యారాశి : మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఈ రాశివారు పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు. బుధుడు కన్యారాశిని కూడా పాలిస్తాడు. ఈ శివలింగం మధ్యప్రదేశ్‌లోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయినిలో ఉంది. శివరాత్రి రోజు వీరు ఈ జ్యోతిర్లింగాన్ని పూజించినా, సందర్శించినా శివయ్య అనుగ్రహం పొందడంతోపాటు అంతా మంచి జరుగుతుందంటున్నారు పండితులు.

మహా శివరాత్రి రోజున జ్యోతిర్లింగాల దర్శనం ఎంతో పుణ్యం - ఎక్కడున్నాయి? - ఎలా వెళ్లాలి?

తుల : వీరు పూజించాల్సిన శివలింగం.. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. తులారాశిని సామరస్య గ్రహమైన శుక్రుడు పరిపాలిస్తాడు. వారణాసిగా కాశీ క్షేత్రంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. మహాశివరాత్రి పర్వదినాన ఈ రాశివారు కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.

వృశ్చికం : ఈ రాశివారు నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ జ్యోతిర్లింగం గుజరాత్​లోని ద్వారక నగరంలో ఉంది. శివరాత్రి నాడు వీరు ఈ శివలింగాన్ని పూజించినా, దర్శించుకొన్నా మంచిదంటున్నారు పండితులు.

ధనుస్సు : త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ధనస్సు రాశివారు పూజించడం మంచిది. జ్ఞాన గ్రహంగా పిలుచుకునే బృహస్పతి ధనుస్సు రాశిని శాసిస్తుంది. మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలో త్రయంబకేశ్వరం క్షేత్రంలో ఈ జ్యోతిర్లింగం ఉంది.

మకరం : ఈ రాశివారు పూజించాల్సిన జ్యోతిర్లింగం.. కేదార్‌నాథ్. మకరరాశిని శని పరిపాలిస్తుంది. హిమాలయాల్లో ఉన్న కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం.. దృఢత్వం, స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి అంకితంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల పాపాలు తొలగి పుణ్య ఫలాలు పొందవచ్చని చెబుతున్నారు పండితులు.

కుంభం : ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఈ రాశివారు పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. కుంభ రాశిని శని, యురేనస్​లు పాలిస్తారు. సృజనాత్మకత, మానవతావాదానికి సంకేతం. మహారాష్ట్రలో ఎల్లోరా గుహలకు సమీపంలో ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది.

మీనం : ఇక చివరగా ఈ రాశివారు పూజించాల్సిన శివలింగం.. వైద్యనాథ్ జ్యోతిర్లింగం. మీన రాశిని నెప్ట్యూన్ అనే ఆధ్యాత్మిక గ్రహం పాలిస్తుంది. ఈ జ్యోతిర్లింగం ఝార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఉంది. అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పుకుంటారు ప్రజలు. ఒక్కసారి ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే అన్ని రకాల వ్యాధులూ నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే శివరాత్రి ఈ శివలింగాన్ని ఆరాధించినా అలాంటి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి? మీకు తెలుసా?

మహాశివరాత్రి నాడు - వీటిని తప్పక దానం చేయాలి - మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.