Maha Shivratri 2024 Dos Donts : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుడిని నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తారు. ఈ ఏడాది శివరాత్రి(Maha Shivratri 2024) మార్చి 8వ తేదీ శుక్రవారం వస్తోంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మహాశివరాత్రి నాడు చేయవల్సిన పనులు :
- శివరాత్రి రోజును బ్రహ్మ ముహూర్తంలో.. అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే నిద్రలేచి ధ్యానం చేయడం మంచిది.
- ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం.
- ఇక రోజంతా భక్తి శ్రద్ధలతోశివనామస్మరణతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం.
- అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి. అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండడం మంచిది.
- ఇక ఫాస్టింగ్ టైమ్లో పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు. అయితే, సూర్యాస్తమయం తర్వాత.. అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు.
- శివరాత్రి రోజున పరమశివుడిని పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్లాలి. అలాకాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడా ఆరాధించవచ్చు.
- శివయ్యకు పాలు, పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి, మహాశివరాత్రి రోజు పగలు, రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు.
- దతుర పువ్వులు, పండ్లు, బిల్వ పత్రం, చందనాన్ని పరమశివునికి సమర్పించాలి.
- మహాశివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉండే వారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించాలి.
- అందులో అత్యంత శక్తివంతమైన "ఓం నమ: శివాయ" మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి.
- ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుడిని పూజించాలి.
మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి?
చేయకూడని పనులు :
- ఈ రోజున నల్లని దుస్తులు ధరించకండి. ఎందుకంటే పరమశివుడికి నలుపు ఇష్టం ఉండదు.
- అదేవిధంగా శివయ్యకు ఎర్రని పువ్వులు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి, మహాశివరాత్రి నాడు ఈ రంగు పూలతో పరమశివుడి పూజించకపోవడం మంచిది.
- శివరాత్రి రోజు దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు. అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు.
- మహాశివరాత్రి రోజు శివయ్యకు కంచు పాత్రలో నైవేద్యాలు పెట్టకూడదు.
- అలాకుండా ఎప్పుడూ రాగి, వెండి, ఇత్తడి పాత్రలను ఉపయోగించకుండా చూసుకోండి.
- మహాశివరాత్రి రోజు గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి.
- అదేవిధంగా మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకూడదు. పొగాకు, మద్యానికి దూరంగా ఉండాలి.
మహాశివరాత్రి నాడు - వీటిని తప్పక దానం చేయాలి - మీకు తెలుసా?
మహా శివరాత్రి రోజున జ్యోతిర్లింగాల దర్శనం ఎంతో పుణ్యం - ఎక్కడున్నాయి? - ఎలా వెళ్లాలి?