ETV Bharat / spiritual

మాఘ పూర్ణిమ - విష్ణుమూర్తికి ఈ పూజ చేస్తే ఎంతో ఫలం!

Magha Purnima 2024 Date: హిందూ సంప్రదాయంలో 12 మాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో.. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. అంతేకాదు మాఘమాసంలో వచ్చే మాఘపూర్ణిమకు కూడా విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? శుభ ముహూర్తం, పూజా విధానం వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Magha Purnima 2024 Date
Magha Purnima 2024 Date
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 1:30 PM IST

Magha Purnima 2024 Date and Significance: అన్ని మాసాలలో కెల్లా మాఘ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాఘమాసంలో వచ్చే పూర్ణిమనే మాఘపూర్ణిమ అని పిలుస్తారు. ఈరోజు సముద్రస్నానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? శుభ ముహూర్తం ఎప్పుడు? మాఘ పూర్ణిమ విశిష్టత, పూజా విధానం వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

అగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం. పాపాలను తొలగించేది గనుకనే మాఘ మాసానికి, మాఘ పౌర్ణమికి ప్రాధాన్యం లభించింది. మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రీ మహా విష్ణువు మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగయందు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ రోజు పుణ్య నదుల్లో గానీ, సముద్రంలో గానీ, వారి గృహాల్లో గంగా జలంతో శ్రీ మహావిష్ణువును, గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి. మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి.. శ్రీమన్నారాయణుడిని, సూర్య భగవానుడిని, గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి.. పుణ్యం కలుగుతుందని మాఘ పురాణం తెలియజేస్తోంది.

మాఘ పూర్ణిమ తేదీ, శుభ ముహూర్తం: మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 03.33 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24న సాయంత్రం 05.59 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఉదయ తిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24 అంటే శనివారం నాడు మాఘ పూర్ణిమ జరుపుకోనున్నారు.

మాఘ పూర్ణిమ శుభ సమయం:

స్నానం-దానం ముహూర్తం - 05:11 AM నుంచి 06:02 AM వరకు

అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నం 12:12 నుంచి 12:57 వరకు

సత్యనారాయణ వ్రతం - 08:18 AM నుంచి 9:43 AM వరకు

చంద్రోదయ సమయం - సాయంత్రం 06:12

లక్ష్మీ పూజ సమయం - ఉదయం 12:09 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు

మాఘ పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు..

  • తలస్నానం ఆచరించాలి.
  • శ్రీమన్నారాయణుడిని, గంగను స్మరిస్తూ తర్పణం విడిచిపెట్టాలి.
  • నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం వంటివి చేయడం వల్ల పుణ్యఫలం కలుగుతుంది.
  • ఈ రోజు చేసేటువంటి జపతపహోమాదులకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది.
  • మాఘ పౌర్ణమి రోజు ఆచరించేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది.

పూజా విధానం:

  • పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నదిలో స్నానం ఆచరించాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలం నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు.
  • స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ గదిని అలంకరించుకోవాలి. తర్వాత ఆవునెయ్యితో దీపం వెలిగించాలి.
  • విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించి గంగాజలంతో అభిషేకం చేయాలి.
  • ఈరోజు విష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది.
  • విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది.
  • పండ్లు, నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి.
  • తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మంత్రం: 'ఓం ఘృణి సూర్యాయ నమః'.

మహాశివరాత్రి నాడు శివుడిని ఈ పూలతో పూజిస్తే - అష్టైశ్వర్యాలు కలుగుతాయట!

సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే - వాస్తు దోషాన్ని ఆహ్వానించినట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.