ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు ఫుల్ హ్యాపీ- గణపతి ఆలయ సందర్శన శుభకరం! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 22nd 2024 : ఆగస్టు​ 22న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 4:43 AM IST

Horoscope Today August 22nd 2024 : ఆగస్టు​ 22న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. మానసికంగా, శారీరకంగా ఈ రోజు చాలా శక్తివంతంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి, ఆర్ధిక వృద్ధి వంటి శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం సంతోషదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. స్నేహితుల సహకారంతో వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. ఒక సంఘటన మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబంతో విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు. ఆర్ధికంగా కూడా ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తువాహనాలు కొంటారు. ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలిస్తోంది. కార్యసిద్ధి, శత్రుజయం ఆకస్మిక ధనలాభాలు వంటి సత్ఫలితాలు ఉంటాయి. ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వైద్యపరమైన ఖర్చులకు చాలా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్ల కారణంగా అనిశ్చితితో ఉంటారు. ప్రతికూల ఆలోచనలు రోజంతా ఇబ్బంది పెట్టవచ్చు. యోగా, ధ్యానంతో వాటి నుంచి దూరంగా ఉండవచ్చు. ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయి. ఆధ్యాత్మికత మార్గంలో పయనిస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్నిరంగాల వారికి తమ తమ రంగాలలో ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా మీ ప్రతిభతో అధిగమిస్తారు. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మీ ఖ్యాతిని పెంచుతుంది. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి పర్యటక ప్రదేశాలలో పర్యటిస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి పరంగా ప్రయోజనం పొందుతారు. చేపట్టిన అన్ని పనులు విజయవంతం కావడం మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కూడా గొప్ప విజయాలు అందుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఎదురుకావడం వల్ల ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. షేర్ మార్కెట్లలలో తీవ్రమైన నష్టాలు ఉండవచ్చు. పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంతానంకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే కష్ట నష్టాల కారణంగా మానసిక అశాంతితో ఉంటారు. ఆర్ధిక నష్టం కూడా కలగవచ్చు. ఈ రోజంతా అస్థిరమైన కుటుంబ వాతావరణం వలన కుటుంబ సభ్యులతో గొడవలు పడతారు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్త వహించకపోతే నష్టపోతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొంతమంది బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. అభయ ఆంజనేయస్వామిని ఆరాధిస్తే ఆపదలు తొలగిపోతాయి.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళతారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్ధిక అంశాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులకు, విద్యార్ధులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు తమ పోటీదారులను అధిగమిస్తారు. శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. దుర్గాదేవి ధ్యానంతో శుభయోగాలు కలుగుతాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయం తీసుకోవడం కష్టం కావచ్చు. అందరి ప్రయోజనాలను కాపాడే నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. లేకుంటే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు కొంటారు. విద్యార్ధులు తమ చదువుల పైన దృష్టి సారించాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్లు ప్రారంభించడానికి మంచిరోజు. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆదాయం కూడా వృద్హి చెందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆర్ధిక లాభాలకు చాలా అవకాశం ఉంది. ధార్మిక కార్యకలాపాలు, తీర్థయాత్రలపైన డబ్బు ఖర్చు చేస్తారు. మాతృ వర్గం నుంచి అందిన శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.