Horoscope Today April 5th 2024 : ఏప్రిల్ 5న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మిత్రులతో వ్యాపార సంబంధ చర్చలు జరుపుతారు. సన్నిహితులతో విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా అనుకూలం. సూర్యారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కఠినమైన సమస్యలు ఎదురవుతాయి. మీ ప్రతిభతో సమస్యలను పరిష్కరిస్తారు. పనులు ఆలస్యం అవుతున్నాయని నిరాశ చెందకండి. మీ సహనమే మీకు శ్రీరామరక్ష! హనుమాన్ చాలీసా పఠించండి.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాల్లో దూకుడుగా ఉండవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మేలు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. శ్రీలక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమఫలితాలు ఉంటాయి. వృత్తివ్యాపారాలలో రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆర్థికంగా లాభం ఉంటుంది. దుర్గా దేవి ధ్యానం మేలు చేస్తుంది.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేకుంటే నష్టపోతారు. కొత్త కోర్సులు నేర్చుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తారు. బంధుమిత్రులతో కులాసాగా గడుపుతారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నూతన ఆదాయవనరుల కోసం ప్రయత్నిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సంతోషంగా గడిచిపోతుంది. మధురస్మృతులను నెమరు వేసుకుంటారు. ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే! ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వృత్తి పరంగా, న్యాయ పరంగా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. మీ వైఖరి అందరినీ ఆకట్టుకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. శివాలయం సందర్శన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులకు తగినట్లుగా ఆదాయం ఉంటుంది. శుభాలనిచ్చే లక్ష్మీస్తోత్రం చదవండి.

ధనుస్సు (Sagittarius) : ధనస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గత తప్పిదాలను గురించి ఆలోచిస్తుంటారు. మీ జట్టు విజయం కోసం తీవంగా కృషి చేసినా ప్రశంసలు లభించక నిరాశ చెందుతారు. సహనంతో ఉంటే మేలు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని సంఘటనలు చికాకు కలిగించినా మెల్లగా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా అనుకూలం. శనిస్తోత్రం పఠించండి.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీరు ఆధ్యాత్మికంగా గడుపుతారు. తీర్థయాత్రలకు వెళతారు. దైవ సంబంధ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కొన్ని లీగల్ వ్యవహారాలు సెటిల్ అవుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు కీలకమైన రోజు. ముఖ్యమైన వ్యవహారాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మేలు. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండండి. వినాయకుని ధ్యానం మేలు చేస్తుంది.