Horoscope Today April 4th 2024 : ఏప్రిల్ 4న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. వృత్తివ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తికి సంబంధించి దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణం మీకు లాభం తెచ్చి పెడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఆర్ధికంగా అనుకూలం. శివారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. దూరప్రాంతాలకు ప్రయాణ సూచన ఉంది. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విదేశీయానం చేసే అవకాశం ఉంది. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంది. తీర్థయాత్రలకు వెళ్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఆస్తికి, భాగ్యస్వామ్యకి చెందిన విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలు ఆందోళన కలిగిస్తాయి. ఒత్తిడికి దూరంగా ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. సూర్యుడి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఎటు చూసినా విజయమే! ఈరోజంతా సరదాగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడువుతారు. ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. విందువినోదాలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వినాయకుడు ఆరాధన మేలు చేస్తుంది.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. తోటి ఉద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఒక చేదు వార్త వినాల్సి వస్తుంది. పనిలో ఆటంకాలు చికాకు పెడతాయి. వాదనలకు దూరంగా ఉండండి. సంయమనం పాటించండి. దుర్గాదేవి ధ్యానం శుభఫలితాలను ఇస్తుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల విషయంలో ఆందోళన చెందుతారు. దీంతో మీరు శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉండండి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. నవగ్రహ ధ్యానం చేస్తే సమస్యలు ఉండవు.

తుల (Libra) : తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మీ కోపమే మీకు శత్రువుగా మారుతుంది. కోపాన్ని వీడకపోతే సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో గొడవలు చికాకు కలిగిస్తాయి. అయితే ఈ గొడవలకు మీరే కారణమని మర్చిపోవద్దు. మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. నీటిగండం ఉంది జాగ్రత్తగా ఉండండి. ఆస్తి, కుటుంబ వారసత్వానికి సంబంధించిన వ్యహారాలలో జాగ్రత్త వహించండి. నృసింహధ్యానం మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. వృత్తివ్యాపారాల్లో రాణిస్తారు. మీ ప్రతిభతో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొన్ని స్వల్ప అడ్డంకులు ఉన్నాయి. వాటిని కూడా అధిగమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా అనుకూలం. శివాష్టకం పఠించండి. అంతా మంచే జరుగుతుంది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఒకింత ఒత్తిడికి లోనై పనులు పూర్తి చేయలేక నిరాశకు గురవుతారు. కుటుంబ వాతావరణమూ ప్రతికూలంగా మారుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆంజనేయస్వామి ధ్యానం ప్రశాంతతను ఇస్తుంది.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. వృత్తివ్యాపారాల్లో మీదే పైచేయి ఉంటుంది. సరైన ప్రణాళికతో ఉంటే మంచి లాభాలను గడిస్తారు. కుటుంబ వాతావణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు ఉంటాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. విఘ్నేశ్వర ధ్యానం శుభప్రదం.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. తగిన విశ్రాంతి అవసరం. కోర్టు వ్యవహారాల పట్ల శ్రద్ధ పెట్టండి. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. శ్రీలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. మోసం చేసేవారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడి ఉంటుంది. అన్ని విషయాల్లో ఆచీతూచీ వ్యవహరిస్తే మేలు. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం సూచితం. శనిస్తోత్రం పఠించండి. శుభం కలుగుతుంది.