Horoscope Today April 3rd 2024 : ఏప్రిల్ 3న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తివ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. చర్చలు ఫలవంతం అవుతాయి. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే కాలం. ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తివ్యాపారాలలో మీ నైపుణ్యాలతో అందరిని ఆకట్టుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. సూర్య నమస్కారం చేయడం మేలు చేస్తుంది.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కొన్ని ఆందోళనకరమైన ఘటనలు ఎదురుకావచ్చు. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యం సహకరించదు. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం చేయండి. ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్థులకు ధనలాభం ఉండే అవకాశం ఉంది. విహారయాత్రలకు వెళ్తారు. సుబ్రహ్మణ్యస్వామి దర్శనం మేలు చేస్తుంది.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాదప్రతివాదనలకు దూరంగా ఉండండి. పని ప్రదేశంలో కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంయమనం పాటించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓర్పుగా సహనంగా ఉండడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఔషధ సేవనం తప్పదు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం ఉండదు. షేర్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు సరైన సమయం కాదు. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

తుల (Libra) : తులారాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. గ్రహబలం బాగున్నా కొన్ని సొంత తప్పిదాల వల్ల మీ పరపతి దెబ్బ తినవచ్చు. వాదనలకు దిగవద్దు. మాటలు జాగ్రత్తగా మాట్లాడితే మేలు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం సహకరించదు. దుర్గాదేవీ ధ్యానం మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ఈరోజు శుభంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. చర్చలు ఫలిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) : ధనస్సురాశి వారికి ఈరోజు సాధారణంగా గడుస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతారు. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. గురు ధ్యానం మేలు చేస్తుంది.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఇంట్లో బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలం. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విందువినోదాలలో పాల్గొంటారు. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంది. చాకచక్యంగా మాట్లాడి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఏ విషయాన్నీ ఎక్కువగా సాగతీయవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అన్ని రంగాల వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ధనలాభం సూచితం. లక్ష్మీదేవీ ఆరాధన మేలు చేస్తుంది.