Horoscope Today April 1st 2024 : ఏప్రిల్ 2న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మనోబలంతో విజయాలను సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా అనుకూలం. దైవబలం రక్షిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పట్టుదలతో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్థికలాభం ఉంది. ఆరోగ్యం బాగుటుంది. స్థిరాస్తి కొనుగోళ్లు చేస్తారు. సూర్య నమస్కారాలు మేలు చేస్తాయి.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తిఉద్యోగ వ్యాపారాలలో విజయం ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రుజయం. దుర్గా ధ్యానం శుభప్రదం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల మీకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు కూడా చాలా మంచి రోజు. ఆదిత్యహృదయం పారాయణ మేలు చేస్తుంది.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు చాలా ఆనందంగా గడిచిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం ఉంది. శుభవార్తలు వింటారు. శ్రీ ఆంజనేయస్వామి ధ్యానం మేలు చేస్తుంది.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనవసరపు విషయాలలో జోక్యం కల్పించుకోవద్దు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. తీవ్రంగా కష్టపడితే తప్ప అనుకున్న పనులు పూర్తికావు. దైవబలాన్ని నమ్మండి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పెద్దల సలహా అవసరం. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాలవారు విజయం సాధిస్తారు. దైవబలం మీకు అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. మేలు కలుగుతుంది.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. కలిసివచ్చే కాలం సమీపిస్తోంది. సంఘంలో పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన శుభప్రదం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఒక ప్రణాళికతో ముందుకు పోకపోతే సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. ఆరోగ్యం సహకరించదు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. ఓర్పుగా ఉండండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా లేదు. లక్ష్యసాధన కోసం ఓర్పు వహించండి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. కీలక విషయాలలో అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దుర్గాస్తుతి చదవడం మేలు చేస్తుంది.