Horoscope Today April 17th 2024 : ఏప్రిల్ 17న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొన్ని ఘటనల కారణంగా అశాంతికి గురవుతారు. మీ తల్లి గారి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందర పడకుండా ఆచి తూచి నిర్ణయం తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా మీరు నూతనోత్సహంతో ఉంటారు. రచనా వ్యాసాల పట్ల ఆసక్తి చూపిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధికంగా అనుకూలం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) : మిధునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులు కొంచెం ఆలస్యమయినా తప్పకుండా పూర్తి అవుతాయి. ఆందోళన చెందవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో మీరు చేపట్టే అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్ధికంగా పలు ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. వ్యాపారస్థులకు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. లింగాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వీలైనంత వరకు మౌనంగా, శాంతంగా ఉంటేనే మేలు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సుబ్రమణ్య ధ్యానం మేలు చేస్తుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధనలాభం సూచితం. స్నేహితులతో కులాసాగా గడుపుతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అదృష్ట దాయకంగా ఉంటుంది. అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. గృహంలో శాంతి సౌఖ్యం ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన అదృష్టాన్ని ఇస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది. పనులు ఆలస్యమవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సూర్య ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కోపాన్ని అదుపులో ఉంచుకోక పొతే ప్రమాదం. కుటుంబం కలహాలు ఉంటాయి. సంయమనం పాటిస్తే మేలు. ఉద్యోగస్థులకు పనిభారం, అలసట ఉంటాయి. తగు విశ్రాంతి అవసరం. శివారాధన మేలు చేస్తుంది

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవకాశవాదులతో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం. ఎవరితోనూ వాదనలకు పోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. అన్నింటా విజయం ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహకారంతో మంచి ఫలితాలను పొందుతారు. ఆంజనేయస్వామి ధ్యానం చేయండి.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఆర్ధికంగా ఈ రోజు మంచి ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారంలో కానీ, విదేశీ పెట్టుబడుల రూపంలో కానీ ధనప్రవాహం ఉంటుంది. కొత్త ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.