ETV Bharat / spiritual

ఈ రాశివారు స్నేహితులతో కలిసి ట్రిప్​కు- ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు! - Horoscope Today - HOROSCOPE TODAY

Horoscope Today April 15th 2024 : ఏప్రిల్​ 15న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 15th 2024-in-telugu-horoscope

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 3:46 AM IST

Horoscope Today April 15th 2024 : ఏప్రిల్​ 15న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజంతా చాలా సరదాగా గడిచిపోతుంది. కొత్త ప్రదేశాల పర్యటనకు వెళతారు. ఈ పర్యటనలో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే కొత్త విషయాలను తెలుసుకుంటారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరగవచ్చు. వేచి చూడండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. నిదానమే ప్రదానం అన్నట్లుగా ఈ రోజు వ్యవహరిస్తే మేలు. ఏ పనిలోనూ తొందరపాటు పనికి రాదు. తొందరపాటుతో గందరగోళానికి గురైతే సమయం వృధా అవుతుంది. రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. కళాకారులు, రచయితలకు కలిసి వచ్చే కాలం. సృజనాత్మకతకు శ్రీకారం చుట్టండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఏది ఏమైనా ప్రయాణం వాయిదా వెయ్యండి. ముఖ్యమైన పనులు ఈ రోజు మొదలు పెట్టవద్దు. దుర్గాదేవి ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఆర్ధికంగా విపరీతమైన లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. ప్రతికూల ఆలోచనలను వీడండి. మిత్రుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఇంట్లో అశాంతిగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. వినాయకుని పూజిస్తే శాంతి నెలకొంటుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. విందువినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజంతా సరదాగా గడిచిపోతుంది. ఆకస్మిక ధనలాభం సూచితం. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. రాజకీయనాయకులకు పదవులు వరిస్తాయి. ప్రభుత్వ పరంగా లాభాలు ఉంటాయి. అన్ని పనులు సునాయాసంగా పూర్తి కావడం వల్ల మీరు కులాసాగా ఉంటారు. ఆంజనేయస్వామి ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. చేపట్టిన అన్ని పనులను ఒక ప్రణాళికతో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. లలిత కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వాదనలకు దూరంగా ఉంటే మేలు. తీర్థయాత్రకి వెళ్లే అవకాశం ఉంది. శివారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. పనులు అనుకున్నట్టుగా సాగవు కాబట్టి కొత్త కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సంయమనం పాటించండి. దుర్గాదేవి ధ్యానం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులను కలిసే అవకాశం రావడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో విహార యాత్రకు వెళతారు. విందువినోదాల్లో పాల్గొంటారు. మీ సృజనాత్మకత మీకు ప్రశంసలు తెచ్చి పెడుతుంది. వ్యాపారుల మంచి లాభాలను అందుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. గురువు ఆరాధనతో సత్ఫలితాలను పొందుతారు.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఏ వృత్తి వారికైనా ఈ రోజు చేసే పనిలో విజయం ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆందోళనలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఎటు చూసినా శుభఫలితాలే గోచరిస్తున్నాయి. శనిస్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేనందున కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకూడదు. ప్రయాణాలు చేయకూడదు.ఈ రోజు మొత్తం అశాంతి, ఆందోళన ఉండవచ్చు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. మీదైనా శైలిలో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. శనికి అభిషేకం చేయిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఎవరితోనూ వాదనలు చేయవద్దు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. మానసిక అశాంతికి గురవుతారు. ఆర్ధికంగా భారీ నష్టం ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మవద్దు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కలతకు గురి చేయవచ్చు. అందుకే ఈ రోజు శాంతంగా ఉండండి. యోగా, ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆంజనేయస్వామి ధ్యానం చేస్తే పరిస్థితులు కుదుటపడతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.