ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే! శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం! - Horoscope Today April 10th 2024

Horoscope Today April 10th 2024 : ఏప్రిల్​ 10న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 10th 2024
Horoscope Today April 10th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 5:01 AM IST

Horoscope Today April 10th 2024 : ఏప్రిల్​ 10న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి నిదానమే ప్రదానం అన్నట్లుగా ఉండాలి. దూకుడు తగ్గించుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకొని శాంతంగా ఉండాలి. కొత్తగా ఏ పనులు ఈ రోజు మొదలు పెట్టవద్దు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన మంచిది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు కాలం కలిసిరాదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారం మీ చేతిలోనే ఉంది కాబట్టి ఆలోచించి నిదానంగా అడుగు వేయండి. మనో నిగ్రహం అవసరం. దైవబలం రక్షిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. అన్ని పనుల్లో విజయం సొంతం అవువుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సంతానం పట్ల అధిక శ్రద్ధ పెడతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలం. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. దుర్గాదేవి ధ్యానం మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మీ లక్ష్యం వైపుగా మీ ప్రయాణం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతారు. తీర్థయాత్రలకు వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు ఈ రోజు అంత అనుకూలం కాదు. వినాయకుని ప్రార్థన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఊహకు వాస్తవానికి తేడా తెలుసుకొని మసలుకుంటే మేలు. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రాజకీయనాయకులకు కలిసి వచ్చే కాలం. మొత్తం మీద ఈ రోజంతా సాదాసీదాగా గడిచిపోతుంది. నవగ్రధ్యానం మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అదృష్టం అవకాశం రూపంలో మీ తలుపు తడుతుంది. అవకాశాలను అందిపుచ్చుకొని ముందడుగు వేయండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుటుంది. హనుమాన్ చాలీసా పఠించండి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు గ్రహచారం బాగాలేదు. జీర్ణసంబంధిత అనారోగ్య సూచలు ఉన్నాయి. ఔషధ సేవనం తప్పదు. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఒత్తిడిని వీడి ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశివారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీరు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల కారణంగా అశాంతికి లోనవుతారు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆందోళనకు గురవుతారు. ఆర్థిక నష్టం సూచితం. పరువు ప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. నవగ్రహ ధ్యానం అన్ని విధాలా శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఒత్తిడి కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శనీశ్వర ధ్యానంతో ప్రశాంతతను పొందవచ్చు.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పదునైన మాటలతో సన్నిహితులను బాధ పెడతారు. అందరితో మంచి సంబంధాలు ఉండాలంటే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా అనుకూలం. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.