Horoscope Today December 16th 2024 : డిసెంబర్ 16వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తిపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృతిపరంగా ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట కలహపూరిత వాతావరణం, ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రోజు మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో గందరగోళం, నిర్ణయాల్లో అనిశ్చిత కారణంగా మంచి అవకాశాలను కోల్పోవచ్చు. రాజీపూర్వక ధోరణి, సర్దుకుపోయే తత్వంతో మేలు జరుగుతుంది. ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరిగినా అనవసర ఖర్చులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తారాబలం వ్యతిరేకంగా ఉన్నందున కొత్తగా ఎలాంటి పనులు చేపట్టవద్దు. వృత్తి వ్యాపారాలలో పురోగతి మందకొడిగా సాగుతుంది. ధననష్టం సంభవించే సూచన ఉంది. కుటుంబ కలహాల కారణంగా మానసికంగా ఆందోళన, అశాంతితో ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సందర్భానుసారం నడుచుకుంటే మనచిది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ ఆరాధన శక్తినిస్తుంది.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విహారయాత్రలకు అందమైన ప్రదేశానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. రాబడి పెరుగుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, కార్యసిద్ధి ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దైవబలం ఈ రోజు మీపై సంపూర్ణంగా ఉంటుంది. ఈ రోజు ప్రారంభించే పథకాలు, కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తినిపుణులు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రోజు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తినిపుణులు, ఉద్యోగులకు తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగడం సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన ఫలప్రదంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు ఆచి తూచి అడుగేయాలి. ఆర్థికంగా సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించండి. అన్ని పనులు మీరు అనుకున్నట్టుగా సాగవు కాబట్టి కొత్త స్కీములు, కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ కోపావేశాలను నియంత్రణలో పెట్టుకోండి. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. కార్యసిద్ధి, ఆర్థికవృద్ధి ఉండడం వల్ల ఈ రోజంతా మీరు ఆహ్లదంగా గడుపుతారు. విదేశీయుల సాంగత్యంలో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సాహిత్యపరమైన కార్యకలాపాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఈ రోజు అన్నింటా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రోజు మీ ప్రత్యర్థులు ఓటమి పాలవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతనోత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. రచయితలకు, కళాకారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. దుర్గస్తుతి పారాయణతో ప్రశాంతత కలుగుతుంది.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం వ్యతిరేకంగా ఉన్నందున గతంలో కంటే మీలో ఉత్సాహం, తేజస్సు తగ్గవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు, గొడవలు జరగవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని గొడవలు, వాదనలు చేయకుండా ఉంటే మంచిది. శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఈశ్వరుని ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.