RC 16 Vijay Sethupathi : విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు హీరోగా, మరోవైపు కీలక పాత్రల్లో నటిస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఉప్పెనలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.
అయితే 'ఉప్పెన' సినిమా దర్శకుడు బుచ్చిబాబు, మరోసారి తన కొత్త సినిమా కోసం విజయ్ సేతుపతి తీసుకున్నారని కొద్ది రోజుల క్రితం ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న RC 16 (వర్కింగ్ టైటిల్)లో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ వార్తల సారాంశం.
అయితే తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు విజయ్ సేతుపతి. తాను రామ్ చరణ్ చిత్రంలో నటించట్లేదని స్పష్టం చేశారు. ఆ చిత్రంలో నటించేందుకు తనకు సమయం లేదని పేర్కొన్నారు.
డైరెక్ట్‌గా తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తారా? అనే అడగగా, చాలా కథలు వింటున్నానని, ఏదైనా కథ నచ్చితే అందులోని హీరో క్యారెక్టర్ నచ్చడం లేదని అన్నారు. త్వరలోనే ఓ సినిమా సెట్ అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని, గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు భాషా భేదం లేదని తెలిపారు.
Viduthalai Part 2 Vijay Sethupathi : విడుదలై 2 చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు విజయ్ సేతుపతి. విజయ్, సూరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంజూ వారియర్ మరో కీలక పాత్రధారి. గతేడాది విడుదలై మంచి సక్సెస్ సాధించిన విడుదలై పార్ట్ 1కి కొనసాగింపుగా ఈ చిత్రం రానుంది. సినిమా ఈ నెల 20న (Viduthalai Part 2 Release Date) ప్రేక్షకుల ముందుకు కానుంది. ఈ సందర్భంగానే సేతుపతి, మంజూ వారియర్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొని సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పారు.
క్రిస్టియన్ పద్ధతిలో కీర్తి పెళ్లి- క్యూట్ కపుల్ ఫొటోలు చూశారా?