ETV Bharat / spiritual

మంగళవారం హనుమాన్​ జయంతి- అంజన్నకు ఇవి సమర్పిస్తే అన్నింటా విజయమే! - Hanuman Jayanti 2024 - HANUMAN JAYANTI 2024

Hanuman Jayanti Puja : హిందువులు పూజించే దేవుళ్లలో హనుమంతునికి విశేషమైన స్థానం ఉంది. కష్టంలో ఆపద్బాంధవుడిలా, కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని ఆరాధిస్తారు. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమజ్జయంతి జరుపుకుంటాం. ఏప్రిల్ 23 మంగళవారం నాడు హనుమజ్జయంతి జరుపుకోబోతున్న నేపథ్యంలో ఆ రోజు హనుమంతుని ఎలా పూజించాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

Hanuman Jayanti Puja
Hanuman Jayanti Puja
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 6:10 PM IST

Hanuman Jayanti Puja : ఆంజనేయస్వామికి మంగళవారం, శనివారం ఈ రెండు ప్రీతికరమైనవి. ఈసారి మంగళవారం హనుమజ్జయంతి రావడం గొప్ప విశేషమని పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున హనుమను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ధైర్యం, విజయం, అభయం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలా ఒకటేమిటి ఏది కావాలంటే అది మన సొంతం అవుతుంది!

హనుమజ్జయంతి పూజా విధానం
హనుమజ్జయంతి రోజు దేశవ్యాప్తంగా అన్ని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ రోజున భక్తులు ఆలయాల్లో సుందరకాండ పఠనం, భజనలు, ఆకు పూజలు, సింధూర పూజలు విశేషంగా చేస్తారు. హనుమంతుని ప్రీతి కోసం వడ మాలలు, అప్పాల మాలలు వంటివి విశేషంగా సమర్పిస్తారు.

హనుమజ్జయంతి పూజకు సుముహూర్తం
తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర శుద్ధ పౌర్ణమి ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం ఉదయం 9:03 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు తిరిగి రాత్రి 8:14 నుంచి 9:35 వరకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో హనుమంతుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుందని పంచాంగ కర్తలు చెబుతున్నారు.

హనుమను ఇలా పూజిస్తే అన్నింటా విజయం
హనుమజ్జయంతి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉంటానని సంకల్పం చెప్పుకొని నమస్కరించుకోవాలి. ఈ రోజు పసుపు లేదా సింధూరం రంగు వస్త్రాలు ధరించాలి. ఇంట్లో పూజ చేసుకునే వారు ఆంజనేయ స్వామికి సింధూరం, తమలపాకులు సమర్పించాలి. మల్లె నూనెతో స్వామి ఎదుట దీపం వెలిగిచాలి.

ఆలయంలో పూజలు ఇలా!
హనుమజ్జయంతి మంగళవారం రావడం చాలా విశేషం. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని హనుమాన్ ఆలయాల్లో విశేషంగా పూజలు జరుగుతాయి. ఈ రోజు వీలైతే ఆలయానికి వెళ్లి హనుమంతునికి ఆకుపూజ కానీ సింధూర పూజ కానీ చేయిస్తే విశేషమైన ప్రభావం ఉంటుంది. ఇక స్వామికి ఇష్టమైన వడమాల, కానీ అప్పాల మాల కానీ సమర్పిస్తే సకల విజయాలు, కార్యసిద్ధి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక హనుమజ్జయంతి రోజు ఆంజనేయస్వామి ఆలయ పూజారికి అరటిపండ్లు సమర్పిస్తే సమస్త గ్రహ దోషాలు పోతాయని శాస్త్ర వచనం.

భక్తి ప్రధానం
ఆంజనేయస్వామి పూజలో భక్తి ప్రధానం. ఆంజనేయుడు రామభక్తుడు. అందుకే హనుమను పూజించేటప్పుడు కూడా భక్తి ప్రధానం. భక్తితో మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసినా స్వామి అనుగ్రహిస్తాడు. భక్తి లేకుండా ఎంత పెద్ద పూజలు చేసిన వ్యర్థమే! శ్రీరాముని పట్ల హనుమంతునికి ఉన్న భక్తి ప్రపత్తులు వల్లనే ఆంజనేయుడు శ్రీరామునికి నమ్మిన బంటు అయ్యాడు. ఆంజనేయ తత్వం నుంచి మనం గ్రహించవలసినది కూడా ఇదే!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

రుద్రాక్షలు ఎవరు ధరించవచ్చు? ఎలాంటి నియమాలు పాటించాలి? - Rudraksha Health Benefits

పంచ సూత్రాలే మోక్ష మార్గాలు- ఎవరీ మహావీరుడు? జయంతి రోజు ఏం చేస్తారు? - Who Is Lord Mahavir

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.