Fasting tips For Maha Shivratri : ఇవాళ హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. మహా శివరాత్రి కోసం ఎంతగానో ఎదురు చూసిన భక్తులు.. ముక్కంటికి మనసారా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ పరమ శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తూ తరిస్తున్నారు. ఇక.. ఈ రోజున ఎంతో మంది భక్తులు ఉపవాసం పాటిస్తున్నారు. రాత్రంతా జాగరణ చేసేందుకూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. ఉపవాసం ఉండేవారు రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటో నీరసం ఇబ్బంది పెడుతుంది. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
మానసికంగా సిద్ధం కావాలి :
శివరాత్రికి ఉపవాసం ఉండే వారు ముందుగా చేయాల్సిన పని.. మానసికంగా సిద్ధంగా ఉండడం. అలాగే.. ఒత్తిడి, ఆందోళన కలిగించే విషయాల గురించి పట్టించుకోకుండా ఉండాలి. మీ ఇష్టం దైవం సేవలో రోజంతా గడపబోతున్నామనే సానుకూల దృక్పథం పెంచుకుంటే.. మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
మహాశివరాత్రి నాడు ఈ సంకేతాలు కనిపిస్తే - మీకు పరమేశ్వరుడి అనుగ్రహం లభించినట్టే!
నీళ్లు తాగాలి :
ఉపవాసం ఉండే వారు అలసటను దూరం చేసుకోవడానిక కనీసం రోజు మొత్తంలో ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. దీనివల్ల మీరు రోజంతా చురుకుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. నీటి తాగడం వల్ల ఆకలి కాకుండా కూడా ఉంటుంది.
శారీరక శ్రమ లేకుండా చూసుకోండి :
ఉపవాసం చేసేవారు శారీరక శ్రమను కలిగించే పనులు చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ మీరు డెస్క్ వర్క్ చేస్తుంటే మీ పనిని ఈజీగా చేసుకోవచ్చు. శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, భక్తి పాటలు వినడం, యోగా చేయడం వంటివి చేసుకుంటే ప్రశాంతగా ఉంటుంది.
మహాశివరాత్రి నాడు ఇవి కొనుగోలు చేస్తే - అర్ధనారీశ్వరుడి అనుగ్రహం లభించినట్టే!
జ్యూస్‌లు తాగాలి :
గర్భిణులు, డయాబెటిస్, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉపవాసం ఉంటే.. వారు మరికొన్ని జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారు అలసటకు గురికాకుండా ఉండటానికి రెండు, మూడు గంటలకు ఒకసారి పాలు, పండ్ల రసాలు, హెర్బల్ టీ, పెరుగు, మజ్జిగ వంటి వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారు నీరసం రాకుండా ఉంటారని చెబుతున్నారు.
పండ్లు :
ఉపవాసం ఉండే సమయంలో బాగా ఆకలిగా ఉంటే.. అరటి పండ్లు, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉపవాసం విరమించే సమయంలో :
ఉపవాసం ఉన్న వారు.. ఉపవాసాన్ని విరమించే సమయంలోనూ కొన్ని పద్ధతులు పాటించాలి. వెంటనే అన్నం తినడం మంచిది కాదు. మొదట ఏదైనా పండ్ల జ్యూస్ తాగాలి. ఆ తర్వాత ఏవైనా ఫ్రూట్స్ లేదా లైట్‌గా ఉండే ఆహారం తినాలని సూచిస్తున్నారు. ఆహారంలో ఫైబర్, ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
మహాశివరాత్రి నాడు - మీ ప్రియమైన వారికి స్పెషల్‌గా విషెస్ చెప్పండిలా!
మహాశివరాత్రి : ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని పూజించాలో మీకు తెలుసా?