ETV Bharat / spiritual

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం - సరిగ్గా ఆ సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలట! - Best Time to Open Doors and Windows

Best Time to Open Doors and Windows: ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలని, సిరిసంపదలతో తులతూగాలని కోరుకుంటారు. అయితే.. మనం చేసే తప్పులే మనకు అదృష్టాన్ని దూరం చేస్తున్నాయంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Best Time to Open Doors and Windows
Best Time to Open Doors and Windows (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 10:22 AM IST

Best Time to Open Doors and Windows as Per Vastu: లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మనం చేసే చిన్న చిన్న తప్పులు మనకు అదృష్టాన్ని దూరం చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది.. ఏ సమయంలో పడితే.. ఆ సమయంలో తలుపులు, కిటికీలు తెరవడం అంటున్నారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఇంటి తలుపులు, కిటికీలు తెరవడానికి ఒక సమయం ఉందని అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

"ధనమూలం ఇదం జగత్" అని శాస్త్రం చెబుతోంది. కారణం ధనం లేకపోతే ఏ పనులూ కావు. ఈ లోకంలో మనిషి మనుగడకు డబ్బే ప్రధానం. అందుకే ఎవరెన్ని మాటలు చెప్పినా డబ్బు లేనిదే ఏదీ జరగదు. మరి ధనం రావాలంటే కష్టపడి పని చేయాలి. అయితే ఎంత కష్టపడినా లక్ష్మీదేవి కటాక్షం ఉండి తీరాలని, అమ్మ కటాక్షం లభిస్తేనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. అందుకోసం ఉదయం, సాయంత్రం తలుపులు, కిటికీలు ఓపెన్​ చేయడానికి కొంత అనువైన సమయం ఉందని అంటున్నారు. ఆ సమయం ఏదంటే..

తలుపులు, కిటికీలు తెరవడానికి అనువైన సమయం:

  • సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మ ముహూర్తంలో తూర్పు దిశలో ఉన్న అన్ని తలుపులూ, కిటికీలను తెరవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటున్నారు.
  • సూర్యోదయం తర్వాత, ఉత్తర దిశలో ఉన్న తలుపులు, కిటికీలను తెరవాలని.. ఉత్తర దిశ జ్ఞానం, శ్రేయస్సు, సంపదకు సంబంధించినదని అంటున్నారు.
  • అదే విధంగా సూర్యాస్తమయంలో ఇంట్లో దీపం వెలిగించడం.. తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం శ్రేయస్కరమని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు.

ఇంట్లో రెండు వంట గదులు ఉండొచ్చా? - వాస్తు నిపుణుల సమాధానమిదే! - Is Two Kitchens are Good in Duplex

ఇవి కూడా తప్పనిసరి:

  • ఇంటి ముఖ్య ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా, అలంకరించి ఉండాలని అంటున్నారు.
  • అలాగే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ద్వారానికి ఎరుపు లేదా పసుపు రంగులతో ముగ్గులు వేయమని సూచిస్తున్నారు.
  • ఇంట్లో ఎల్లప్పుడూ సహజమైన కాంతిని ఉండేలా చూసుకోమంటున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి చీకటిని ఇష్టపడదని చెబుతున్నారు.
  • అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.

NOTE : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

అప్పులతో అవస్థలు పడుతున్నారా? - వాస్తు ప్రకారం ఇలా చేస్తే అన్నీ తీరిపోతాయట! - Vastu Tips to Attract Money

బీరువాలో డబ్బు, నగలు ఒకేచోట పెట్టకూడదు! వాస్తు ప్రకారం ఇలా చేస్తే మీ ఆదాయం రెట్టింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.