ETV Bharat / spiritual

మీ బాత్‌రూమ్‌ ఇలా ఉంటే - వాస్తు దోషం చుట్టుముడుతుంది!

Bathroom Vastu Tips : ఇంటి నిర్మాణంతో పాటు.. బాత్‌రూమ్​ సైతం వాస్తుకు అనుగుణంగా ఉండాలని అంటున్నారు వాస్తు నిపుణులు. లేదంటే దోషం చుట్టు ముడుతుందని అంటున్నారు. మరి.. వాస్తు ప్రకారం బాత్‌రూమ్‌ ఎలా ఉండాలో మీకు తెలుసా??

Bathroom Vastu Tips
Bathroom Vastu Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 3:02 PM IST

Bathroom Vastu Tips : గతంలో బాత్​ రూమ్ ఇంటికి కాస్త దూరంలో నిర్మించుకునే వారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మంది బెడ్​ రూమ్​కు అనుబంధంగా బాత్‌రూమ్‌ కట్టించుకుంటున్నారు. అపార్ట్​ మెంట్లలోనే కాకుండా.. ఇండిపెండెంట్ హౌస్​లలో కూడా ఈ తరహా నిర్మాణమే చేపడుతున్నారు.

ఇలాంటి అటాచ్​డ్​ బాత్​ రూమ్స్.. మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి, అలాగే ఎక్కువ దూరం నడవలేని వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే.. ఇంటి నిర్మాణంలో వాస్తు ఎలాగైతే చూస్తామో.. బాత్‌రూమ్‌ విషయంలోనూ వాస్తు నియమాలను అలాగే పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. వాస్తు ప్రకారం బాత్‌రూమ్‌ ఎలా ఉండాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

బాత్‌రూమ్‌ వాస్తు ఇలా ఉండాలి:

  • ఇంట్లో వాస్తు ప్రకారం బాత్‌రూమ్ నిర్మాణం ఉంటేనే ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నిపుణులంటున్నారు. కాబట్టి, బాత్‌రూమ్‌ను నిర్మించేటప్పుడు అది ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
  • అలాగే బాత్‌రూమ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ దక్షిణ, ఆగ్నేయ లేదా నైరుతి దిశలో నిర్మించకూడదట.
  • వాస్తు ప్రకారం బాత్‌రూమ్‌ ఎప్పుడూ వంటగది ముందు గానీ లేదా దాని పక్కనే గానీ ఉండకుండా చూసుకోండి.
  • అలాగే టాయిలెట్‌ నిర్మాణం పశ్చిమ లేదా వాయువ్య దిశలో కూర్చుని ఉండేలా చూసుకోవాలి.
  • మీరు ఎల్లప్పుడూ బాత్‌రూమ్‌లో ఉండే బకెట్‌ లేదా టబ్‌ను నీటితో నింపి ఉంచాలి.
  • అలాగే బకెట్‌ ఖాళీగా ఉంటే దానిని ఎల్లప్పుడూ తలకిందులుగా పెట్టాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో శ్రేయస్సు కలుగుతుందట.
  • బాత్‌రూమ్‌లో బ్లూ కలర్‌లో ఉండే బకెట్‌ ఉండాలి. వాస్తు ప్రకారం ఈ రంగుకు ప్రత్యేక స్థానం ఉందట. అలాగే మగ్‌ కూడా అదే కలర్ ఉండేలా చూసుకోండి.
  • ఇంట్లో బాత్‌రూమ్‌ డోర్‌ ముందు ఎప్పుడూ అద్దాలు పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందట.
  • అలాగే బాత్‌రూమ్‌ డోర్‌కు ఉత్తరం లేదా తూర్పు దిక్కున ఉన్న గోడపై అద్దం పెట్టుకోండి. అలాగే అద్దం దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. వాస్తు ప్రకారం గుండ్రంగా ఓవల్ షేప్‌లో ఉండే అద్దాలు మంచివి కావని అంటున్నారు.
  • బాత్‌రూమ్‌ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచండి. ఎందుకంటే తెరిచి ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందట.
  • వాస్తు ప్రకారం బాత్‌రూమ్‌లోని కుళాయిలు (ట్యాప్) లీక్‌ కాకుండా ఉండాలి. ఇవి లీక్‌ అయితే, ఇంట్లో డబ్బు అంతా వృథాగా ఖర్చు అయిపోతుందట.
  • బాత్‌రూమ్‌లో స్విచ్‌బోర్డులు, గీజర్‌, వంటి ఎలక్ట్రికల్‌ వస్తువులను ఆగ్నేయ దిశలో అమర్చుకోవాలి.
  • అలాగే బాత్‌రూమ్‌ టైల్స్‌ రంగు ఎప్పుడూ లైట్‌ కలర్‌లో ఉండాలి. ఇంకా బాత్‌రూమ్ గోడలకు లైట్‌ కలర్‌ పేయింట్లను వేయించండి.
  • బాత్‌రూమ్‌లో గాలి వచ్చి పోయేలా కిటికీ కచ్చితంగా ఉండాలి. ఇది తూర్పు, ఉత్తరం లేదా పడమర దిశలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
  • పైన తెలిపిన విధంగా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో అంతా మంచి జరుగుతుందట.

సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే - వాస్తు దోషాన్ని ఆహ్వానించినట్టే!

మీ అపార్ట్‌మెంట్లో వాస్తు దోషం - ఇలా తొలగించండి!

వాస్తు దోషం - ఇంటి మెయిన్‌ డోర్‌ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.