ETV Bharat / spiritual

అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి శుభసమయం ఏది? - మీకు తెలుసా? - Akshaya Tritiya 2024 - AKSHAYA TRITIYA 2024

Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ రోజున కాస్తయినా బంగారం, వెండి కొనుగోలు చేయాలని.. దానివల్ల లక్ష్మీ దేవి ఇంటికి వస్తుందని భక్తులు నమ్ముతారు. మరి ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది? ఆ రోజున ఏ సమయంలో బంగారం కొనుగోలు చేయాలో మీకు తెలుసా?

Akshaya Tritiya
Akshaya Tritiya 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 11:09 AM IST

Akshaya Tritiya 2024 Date : హిందువులు అక్షయ తృతీయను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని పూజించి బంగారం, వెండితో చేసిన ఆభరణాలను కొనుగోలు చేస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. అలాగే అక్షయ తృతీయ (Akshaya Tritiya) నాడు బంగారం కొనుగోలు చేసిన వారి ఇంట్లో ఎప్పుడూ కూడా సిరిసంపందలకు లోటు ఉండదని నమ్ముతారు. అందుకే చాలా మంది ఈ రోజున బంగారం కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. మరి.. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది? బంగారం కొనుగోలు చేయడానికి శుభ సమయం ఏది? అక్షయ తృతీయ విశిష్టత ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

అక్షయ తృతీయ విశిష్టత :
పురాణ గాథల ప్రకారం.. అక్షయ తృతీయ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. అక్షయం అంటే నాశనం కానిది, తరగనిది అని అర్థం. త్రేతా యుగం ఈ రోజునే ప్రారంభమైందట. పార్వతీ దేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజని పండితులు చెబుతారు. అలాగే.. వేదవ్యాసుడు మహాభారత రచనను అక్షయ తృతీయ రోజునే ప్రారంభించాడట. ఇలా అక్షయ తృతీయ రోజు గురించి పురాణ గాథలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజున ఐశ్వర్యాలకు అధినేత్రి అయిన శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి, బంగారం, వెండి అభరణాలు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

అక్షయ తృతీయ నాడు అప్పు తెచ్చి బంగారం కొనొద్దు

బంగారం కొనడానికి శుభ సమయం :
ప్రతీ సంవత్సరం హిందువులు వైశాఖ మాసం శుక్ల పక్షం తదియ నాడు అక్షయ తృతీయ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయను మే 10వ తేదీన శుక్రవారం రోజున వస్తోంది. ఆ రోజున ఉదయం 4:17 గంటలకు అక్షయ తృతీయ ప్రారంభమై.. మరుసటి రోజు అంటే మే 11న తెల్లవారుజామున 2:50 గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.

అక్షయ తృతీయ రోజున ఉదయం 5:49 గంటల నుంచి మధ్యాహ్నం 12:23 గంటల వరకు మంచి సమయం ఉందని.. ఈ సమయంలో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని అంటున్నారు. అలాగే ఈ రోజున ఏదైనా కొత్త పని ప్రారంభించినా కూడా ఎటువంటి ఆటంకాలూ కలగకుండా విజయవంతం అవుతుందని చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా?.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

అక్షయ తృతీయకు నగలే కాదు.. బంగారం ఇలా కూడా కొనొచ్చు.. ట్రై చేస్తారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.