Minors in Women Harassment : ఈ మధ్యకాలంలో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లుతున్నాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా రోడ్లు, క్లాసుల్లో వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నవారిలో మైనర్లే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. రేపటి సమాజానికి ఆశాజనకంగా ఉండాల్సిన బాలలు ఇలాంటి ఘటనలు పాల్పడి ఊచలు లెక్కపెడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన సమయంలో నేరాలు చేస్తు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరుగుతున్న మహిళలను వేధింపులకు గురిచేస్తున్న వారిలో 18ఏళ్లలోపు మైనర్లే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం.
గణాంకాల్లో మైనర్లే అధికం : హైదరాబాద్ నగరంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆ భద్రతా విభాగం డీజీ శిఖాగోయల్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో మహిళలు, యువతులు, బాలికలపై జరుగుతున్న నేర వివరాలు ఆయన వెల్లడించారు. ఇందులో ఆందోళన కలిగించిన విషయం ఏంటంటే ఆ నేరాల్లో మైనర్లు పెద్ద సంఖ్యలో ఉండటమే. మొదటి ఆరు నెలల్లో షి టీమ్స్ నమోదు చేసిన వివిధ కేసుల గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాగా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులను అరికట్టడంలో షి టీమ్స్ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. వివిధ రుపాల్లో జరుగుతున్న వేధింపులకు అరికట్టడం వల్ల మహిళలు తీవ్రమైన నేరాల బారిన పడకుండా కాపాడగలుగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 31జిల్లాలలక చెందిన 300 అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రేమ వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఆత్మహత్య - Minor suicide Due love harassment
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 331 షి టిమ్స్ పనిచేస్తున్నాయని, మహిళలు వేధింపులకు గురికాకుండా సాంకేతిక పరిజ్ఞానం వాడి అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఎక్కువగా వేధింపులకు గురయ్యే ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి అక్కడా పోలీసులు మారు వేశాల్లో ఉండటం, ఆధారాలు సేకరించడం, తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సైబర్ వేధింపులపై అవగాహన : సైబర్ వేధింపుల పట్ల స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులక అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. విద్యాశాఖ సౌజన్యంతో రాష్ట్రవ్యాప్తంగా 2021-2023 మధ్య 4,031 పాఠశాలల్లోని విద్యార్థుల, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మరో 1,09,845 విద్యార్థులు, 2,273 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీని వల్ల ఎవరైన తమను వేధిస్తున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.