ETV Bharat / press-releases

వైఎస్సా​ర్సీపీ నేత హత్య కేసు - అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు - YSRCP Leader Murder Case - YSRCP LEADER MURDER CASE

Life Imprisonment Accused in YSRCP Leader Murder Case: ఆరేళ్ల క్రితం జరిగిన వైఎస్సార్సీపీ నేత హత్య కేసులో నిందితులకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా 10వేల రూపాయల జరిమానా విధించింది.

ysrcp_leader_murder_case
ysrcp_leader_murder_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 4:08 PM IST

Life Imprisonment Accused in YSRCP Leader Murder Case: అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2018 మార్చి 30వ తేదీన జరిగిన వైఎస్సార్​సీపీ నేత కందుకూరు శివారెడ్డి హత్య కేసులో ఏడుగురికి రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే 2017 అక్టోబర్ 15వ తేదీన కందుకూరు గ్రామంలో పీర్ల పండుగ జరుగుతోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన శివారెడ్డి తన వాటర్ ట్యాంక్​తో వెళ్తుండగా ఊరేగింపులో కొందరు వ్యక్తులు అడ్డు తగిలారు. పక్కకు తప్పుకోమని చెప్పినప్పటికీ వినకుండా వాదించారు. దీంతో శివారెడ్డి, బాలకృష్ణ వారి సోదరుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ జరిగిన సమయంలో బాలకృష్ణ పంచె ఊడిపోయింది. దీనిని ఆయన తీవ్ర అవమానంగా భావించాడు.

ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. కేసులు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత రాజీ కూడా అయ్యారు. అయితే కేసు రాజీ అయినప్పటికీ బాలకృష్ణ మాత్రం తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో 2018 మార్చి 30వ తేదీన శివారెడ్డి పొలం నుంచి ఇంటికి వస్తుండగా బాలకృష్ణ అతని సోదరులు వేటకుడవళ్లతో వెంటాడారు. శివారెడ్డి కుమారుడు భాను ప్రకాష్ రెడ్డి తన తండ్రిని చంపవద్దని వేడుకున్నప్పటికీ వారు వినలేదు. వేటకొడవళ్లతో వెంటాడి వేటాడి నరికి చంపారు. ఈ సంఘటనకు సంబంధించిన కేసులో మొత్తం పదిమందిపై కేసులు నమోదు చేశారు.

జిల్లా కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదోప వాదాలు గత ఐదేళ్లుగా జరుగుతున్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి వాదనలతో జిల్లా జడ్జి శ్రీనివాస్ ఏకీభవించారు. ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితులకు రెండు జీవిత కాలాలపాటు కఠిన కారాగార శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధించారు. కోర్టు తీర్పు విన్న వెంటనే నిందితులు కోర్టులో కుప్పకూలిపోయారు. నిందితుల బంధువులు కోర్టు ప్రాంగణంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కనిపించారు. మరోవైపు శివారెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు సంచలనగా మారింది.

రెండు దశాబ్దాలపాటు అరాచకం - లెక్కకు మించిన తప్పులు - ఎట్టకేలకు కటకటాల వెనక్కు - pinnelli ramakrishna reddy anarchy

అమానుషం - మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు - నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న సీఐ - Villagers Attack On Women

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.