ETV Bharat / politics

అన్నపై పోటీకి సిద్ధం! - సునీత కాంగ్రెస్​లో చేరేందుకు డేట్ ఫిక్స్​!

YS Sunitha to Join in Congress: స్వార్థం కోసం తమను ఏకాకులను చేసిన సీఎం జగన్‌ను స్వార్వత్రిక ఎన్నికల్లో బలంగా ఢీ కొట్టేందుకు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత ఏకమయ్యారు. సీఎం సొంత జిల్లాలో జగన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలని వ్యూహం సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు షర్మిల లేదా సునీత కుటుంబం నుంచి ఎవరో ఒకరిని బరిలో దింపాలని భావించినట్లు తెలుస్తోంది.

YS_Sunitha_to_Join_in_Congress
YS_Sunitha_to_Join_in_Congress
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 8:38 AM IST

అన్నపై పోటీకి సిద్ధమా! - సునీత కాంగ్రెస్​లో చేరేందుకు డేట్ ఫిక్స్​!

YS Sunitha to Join in Congress: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలతో వివేకా (YS Vivekananda Reddy) కుమార్తె సునీత ఇడుపులపాయ కేంద్రంగా భేటీ (YS Sharmila Sunitha Meeting) కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ వెళ్లిన సునీత, ఎస్టేట్‌లో షర్మిలతో భేటీ అయ్యారు.

ఇద్దరూ ఏకాంతంగా రెండు గంటల పాటు చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో ముఖ్యంగా కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులపై చర్చించారు. పులివెందుల అసెంబ్లీకి వైసీపీ నుంచి సీఎం జగన్, కడప పార్లమెంటు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉండటంతో వారిద్దరినీ ఢీ కొట్టాలంటే తమ కుటుంబం నుంచే కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉండాలనే అంశం ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

వివేకా హత్య కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు సోదరుడు సీఎం జగన్ నుంచి రిక్తహస్తం ఎదురు కావడంతో సునీత ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడంతో, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు సైతం అయ్యారు. ఈమెకు మొదటి నుంచి షర్మిల మాత్రమే అండగా నిలబడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు వైఎస్ షర్మిల అండగా నిలిచారు. సీబీఐకి తన వాంగ్మూలాన్ని కూడా షర్మిల ఇచ్చారు.

వైఎస్సార్​ పాలనతో జగన్​కు పోలికే లేదు- బీజేపీకి బానిసలా మారిన వైసీపీ : షర్మిల

వివేకా కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. వైఎస్ భాస్కరరెడ్డితో పాటు మరికొంతమంది చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉండగా, వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్‌ తెచ్చుకున్నారు. దీనిపై వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే, సునీత కుటుంబం నుంచి కడప లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయించాలని వైఎస్‌ షర్మిల యోచిస్తున్నారు.

ఇదే అంశాన్ని ఇడుపులపాయ భేటీలో షర్మిల-సునీత మధ్య ప్రస్తావనకు వచ్చింది. కడప లోక్‌సభకు సునీత లేదంటే ఆమె తల్లి సౌభాగ్యమ్మను పోటీచేయించాలనే ఆలోచన షర్మిలకు ఉన్నట్లు సమాచారం. మీరు పోటీ చేయండి, నేను ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటానని షర్మిల భరోసా ఇచ్చినట్లు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరూ వైఎస్ సమాధి వద్ద ప్రార్థనల్లో కలిసి పాల్గొన్నారు. త్వరలోనే దిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో సునీత పార్టీలో చేరే విధంగా ఏర్పాట్లు చేస్తానని షర్మిల హామీ ఇచ్చినట్లు తెలిసింది.

"జగన్​ను నమ్మి ఓటేస్తే ఇచ్చిన హామీలన్నీ పక్కనపెట్టారు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.